
బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది స్త్రీ-2తో సూపర్ హిట్ కొట్టిన నటుడు.. ఇటీవల భూల్ చుక్ మాఫ్ అనే మూవీతో ప్రేక్షకులను పలరించారు. ఇపుడు ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘మాలిక్’ (Maalik). గ్యాంగ్‌స్టర్ పొలిటికల్ క్రైమ్ డ్రామా జోనర్లో తెరకెక్కింది.
డైరెక్టర్ పుల్కిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించింది. ప్రొసేన్‌జిత్ ఛటర్జీ, అన్షుమన్ పుష్కర్, సౌరభ్ శుక్లా కీలక పత్రాలు పోషించారు. జులై 11న థియేటర్లో రిలీజైన మాలిక్.. ప్రస్తుతం ఓటీటీలో దూసుకెళ్తుంది. సెప్టెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తుంది. మరి ఈ సినిమా కథేంటనేది చూసేద్దాం.
He has arrived to be the Maalik of your screens 🔥#MaalikOnPrime, Watch now https://t.co/DCRRHUh9YM@RajkummarRao @ManushiChhillar @prosenjitbumba #SaurabhShukla #SaurabhSachdeva @swanandkirkire @Anshumaanpushk1 @justpulkit @KumarTaurani @jayshewakramani pic.twitter.com/DbgRvEXKZx
— prime video IN (@PrimeVideoIN) September 4, 2025
గ్యాంగ్‌స్టర్ కథేంటంటే:
దీపక్ అలియాస్ మాలిక్ (రాజ్‌కుమార్ రావ్) ఒక పేద రైతు కుటుంబంలో పుడతాడు. కానీ.. అండర్ వరల్డ్‌లో చేరి, అలహాబాద్‌లో పవర్‌ఫుల్‌మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. అందరూ అతని పేరు వింటేనే వణికిపోతారు. మాలిక్‌ని చంపాలని మరో గ్యాంగ్‌స్టర్ చంద్రశేఖర్ (సౌరభ్ సచ్‌దేవ్), స్థానిక ఎమ్మెల్యే బల్హార్ (స్వానంద్ కిర్కీరే) మంత్రి శంకర్ సింగ్ (సౌరభ్ శుక్లా) ప్రయత్నిస్తుంటారు.
అందుకోసం ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రభుదాస్ (ప్రొసేన్‌జిత్ ఛటర్జీ)కు అలహాబాద్‌లో పోస్టింగ్ ఇప్పిస్తారు. మరోవైపు గర్భవతి అయిన తన భార్య షాలిని (మానుషి చిల్లార్) కోరిక మేరకు మాలిక్ తప్పుడు పనులు చేయడం మానేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దీపక్.. ‘మాలిక్’గా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? అనేది మిగతా కథ.