Bigg Boss 9: "కెప్టెన్ కాగానే కళ్లు నెత్తికెక్కాయా.. పొగరు తలకెక్కిందా?".. తనూజకు నాగార్జున సీరియస్ వార్నింగ్!

 Bigg Boss 9: "కెప్టెన్ కాగానే కళ్లు నెత్తికెక్కాయా.. పొగరు తలకెక్కిందా?".. తనూజకు నాగార్జున సీరియస్ వార్నింగ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ వారం రణరంగాన్ని తలపించింది.  ఆడియన్స్‌కు కావాల్సినంత మసాలా దొరికింది. కెప్టెన్సీ రేసు నుంచి మొదలైన తనూజ, దివ్యల మధ్య కోల్డ్ వార్‌ కాస్తా.. చిలికిచిలికి గాలివానలా మారి హౌస్‌నే రణరంగంగా మార్చేసింది. మాటల యుద్ధం హద్దులు దాటి, ఒకరిపై ఒకరు పర్సనల్ ఎటాక్‌లు చేసుకునే స్థాయికి వెళ్లింది. వీరిద్దరి ఘర్షణలో ఇంటి సభ్యులు కూడా ఇరు పక్షాలుగా విడిపోయారు.

కెప్టెన్సీతో మొదలైన చిచ్చు..

కెప్టెన్సీ రేసు నుంచి తనూజను తప్పించే క్రమంలో దివ్య చెప్పిన కారణం ఈ గొడవకు మూలంగా మారింది. నా దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. నీకు ఇప్పటికే రెండు వారాల ఇమ్యూనిటీ ఉంది, ఇప్పుడు కెప్టెన్సీ అవసరం లేదు అని దివ్య అనడంతో తనూజ తీవ్రంగా రియాక్ట్ అయింది. ప్రతిసారి నేనే నీకు కనిపిస్తున్నానా? నేను కెప్టెన్సీ ఆడి గెలుచుకున్నా, ఎవరూ నా చేతిలో పెట్టలేదు అంటూ నిప్పులు చెరిగింది. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి.

ఈ వాదోపవాదంలో ఇద్దరూ హద్దులు మీరారు. దివ్యను ఉద్దేశించి తనూజ బయట సరిపోక బిగ్ బాస్‌కి వచ్చావ్ నువ్వు అని పర్సనల్‌గా కామెంట్ చేయగా, దివ్య కూడా తగ్గకుండా నువ్వు సీరియల్ యాక్టర్. అక్కడ ఏడ్చినట్లే ఇక్కడ కూడా ఏడువు, గంటలో పదిసార్లు ఏడ్చేది నువ్వు... సింపతీ స్టార్ అంటూ ఘాటుగా బదులిచ్చింది. చివరకు ఈ గొడవ 'సీరియల్ స్టార్' vs 'రివ్యూవర్' అనే స్థాయికి చేరింది.

 కింగ్ ఎంట్రీతో హౌస్ లో హీట్..

వారమంతా సాగిన ఈ గొడవపై వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున ఎంట్రీతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హౌస్‌మేట్స్‌ను పలకరించిన వెంటనే.. నాగ్ సూటిగా తనూజ, దివ్యల గొడవ అంశాన్ని లేవనెత్తారు. ఇద్దరిలో తప్పు ఎవరిదో చెప్పమని నాగార్జున అడగ్గా, సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తనూజదే తప్పు అని భరణి చెప్పారు.. దివ్య తన పాయింట్ చెప్పినప్పుడు నువ్వు నన్నే ఎందుకు టార్గెట్ చేస్తావ్.. అని తనుజే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది అని అన్నారు. ఇమ్మానుయేల్ మాత్రం దివ్వది తప్పు. ఆర్గ్యుమెంట్ ఓకే కానీ, ఆ గొడవలో దివ్య కొన్ని మాటలు వదిలేసింది అని తెలిపారు. డెమాన్ పవన్ మాత్రం దివ్యాకే సపోర్ట్ చేశారు. తనూజ 'పో పో పో' అనడం వల్లే దివ్య రియాక్ట్ అయ్యింది అని చెప్పుకొచ్చారు.

►ALSO READ | డ్రగ్స్ కేసులో నేను నిర్దోషిని..కోర్టు కేసు కొట్టేసింది..మీ వల్లే మా అమ్మ చనిపోయింది

తనూజకు స్ట్రాంగ్ వార్నింగ్..

హౌస్‌మేట్స్ అభిప్రాయాల తర్వాత నాగార్జున నేరుగా తనూజను ప్రశ్నించారు. "కెప్టెన్ కాగానే కళ్లు నెత్తికెక్కాయా? పొగరు తలకెక్కిందా?" అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ ప్రశ్నకు తనూజ తను అరుస్తుంది సార్, ఇంకేం చెప్పలేక, మాట్లాడలేక 'పో పో' అని అన్నాను అని అమాయకంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. దానిపై నాగార్జున స్పందిస్తూ, "మాట జారితే ఆట జారిపోతుంది" అని తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాక .. మీ ఇద్దరి గొడవలో భరణిని ఎందుకు లాగారు? అని సూటిగా అడగ్గా, భరణిని గొడవలోకి లాగింది తనూజ అని తెలుసుకున్న నాగార్జున.. ఒక్క తప్పు చాలు పాతాళానికి పోతావ్" అంటూ తనూజను మందలించారు. కెప్టెన్సీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వ్యక్తిగత విషయాలపై దాడి చేయడం సరికాదని కింగ్ నాగ్ తనూజకు గట్టిగా క్లాస్ పీకారు. దీంతో ఈ వారం తనూజకు వ్యతిరేకంగా నాగార్జున ఫైర్ అవ్వడం ఆడియన్స్‌ను సైతం ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత దివ్వకు కూడా నాగ్ గట్టిగానే క్లాస్ పీకి వార్నింగ్ ఇచ్చిపడేశారు..