
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆరంభం నుంచీ కొత్తదనం ఏమీ లేదనే విమర్శలు ఉన్నప్పటికీ, హౌస్‌లో మాత్రం రసవత్తరమైన డ్రామాకు ఏమాత్రం కొదవ లేకుండా పోయింది. షో ఫార్మాట్, సెట్టింగ్‌లు మారినా... లవ్ ట్రాక్స్, పోట్లాటలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనే పాత ఫార్ములాలు ఈసారి కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా చేస్తున్నాయి. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య నడిచే ఎత్తులు, పైఎత్తులు, ప్రేమాయణాలు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాయి. ఐదవ వారం ముగిసే సమయానికి హౌస్‌లో ప్రధానంగా ప్రేమ జంటల డ్రామా , ఫన్ ప్రపోజల్స్ హైలైట్ అయ్యాయి.
రీతు-పవన్ కెమిస్ట్రీకి సెటైర్లు
హౌస్‌లో ప్రస్తుతం రీతు-పవన్ లవ్ ట్రాక్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బుధవారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ పెట్టిన 'పట్టు వదలకు, బెలూన్' టాస్క్‌లో విజయం సాధించిన సందర్భంగా, పవన్-రీతు ఒకరినొకరు ఆనందంతో హగ్గులు చేసుకుంటూ తమ బంధాన్ని మరింత బలంగా చాటుకున్నారు. వారి ఈ అత్యుత్సాహంపై ఇతర కంటెస్టెంట్ల నుంచి ఫన్నీ సెటైర్లు పడ్డాయి. ముఖ్యంగా సంజన, "ఛాన్స్ దొరికిందిగా ఇక!" అంటూ ఆటపట్టిస్తుంది. ఆ క్షణం హౌస్‌లో నవ్వులు వెల్లివిరిశాయి. వీరిద్దరి మధ్య బాండింగ్ ఎంత సహజంగా ఉన్నా, కెమెరాల ముందు వీరి హగ్గులు షోలో హాట్ టాపిక్‌గా మారింది.
ట్రయాంగిల్ లవ్...
మరో లవ్ ట్రాక్... తనూజ-ఇమ్మాన్యుయేల్-పవన్ మధ్య ఉన్న ట్రయాంగిల్ యాంగిల్ మరింత చర్చకు దారితీసింది. టాస్క్‌లో ఓటమి చెందడంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్‌ను తనూజ ఈసారి పవన్ పై చూపించింది. ఆమె అలిగినా, పవన్ మాత్రం చాలా కూల్‌గా స్పందిస్తూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేయడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇమ్మాన్యుయేల్, పవన్ ఇద్దరూ తనుజతో సన్నిహితంగా ఉండటం వలన, ఈ ప్రేమకథ హౌస్‌లో రోజుకో మలుపు తీసుకుంటోంది.
ALSO READ : ఇవాళ (OCT 9) ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు..
'అన్నయ్య' జోక్, 'పిల్లాడి' ప్రపోజల్!
బుధవారం ఎపిసోడ్‌లో తనూజ-ఇమ్మాన్యుయేల్ మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను నవ్వించింది. 'నేను నీ బ్రదర్‌గా ఉండాలనుకోవట్లేదు జెస్సీ' అంటూ ఇమ్ము చేసిన సినిమా డైలాగ్ చెప్పాడు. దీంతో నీ వయసెంత అని తనూజ అడిగింది. దీనికి ఇమ్మూ నీకన్నా రెండు సంవత్సరాలు పెద్దే అని చెప్పాడు. దీంతో తనూజ ఫర్లేదులే ఎవరైనా అడిగితే అన్నయ్య లాంటి వాడివని చెప్పేస్తాను అంటూ పంచ్ వేసింది. దానికి ఇమ్ము చెప్పాల్సినోళ్లకి చెప్పెయ్ తమ్ముడని, నాకెందుకు అని కల్యాణ్ వైపు చూసి ఫన్ చేయడం బాగా వర్కౌట్ అయ్యింది.
అయితే, ఈ ఎపిసోడ్ అంతా కల్యాణ్ ఇచ్చిన ప్రపోజల్ తోనే క్లైమాక్స్ అయ్యింది. 'నాలాంటోడు అయితే నీకు ఓకేనా?' అంటూ తనూజకు అతను నేరుగా ప్రపోజ్ చేయగా, 'అందుకే నిన్ను పిల్లాడు అనేది' అని నవ్వుతూ తనుజ కొట్టిన కౌంటర్ కల్యాణ్‌ను సైలెంట్ చేసింది. తన కాబోయే వాడు 'ఏ పరిస్థితుల్లోనైనా కూల్‌గా, కామ్‌గా డీల్ చేసే పర్సన్, నా మైండ్‌సెట్‌కి మ్యాచ్ అయ్యే వ్యక్తి'అని తనుజ చేసిన డిమాండింగ్ వివరణతో కల్యాణ్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ డ్రామాను పక్కనే చూస్తున్న ఇమ్ము-రీతూ చౌదరి పగలబడి నవ్వడం హైలైట్‌గా నిలిచింది.
మొత్తంగా, 31వ రోజు హౌస్‌లో ప్రేమ డ్రామా పెరిగినా, ఆ రోజు చివరికి కల్యాణ్ 'వరస్ట్ ప్లేయర్'గా మిగిలాడు. ఈ వారంలో రానున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఈ లవ్ ట్రాక్స్‌కు ఎలాంటి మలుపులు ఇస్తాయో చూడాలి.