OTT Movies: ఇవాళ (OCT 9) ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. తెలుగులో వార్ 2తో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ

OTT Movies: ఇవాళ (OCT 9) ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. తెలుగులో వార్ 2తో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీ

ఈ వారం థియేటర్లో పెద్ద సినిమాలు ఏవీ థియేటర్కి రావడం లేదు. కేవలం ‘శశివదనే’ రొమాంటిక్ లవ్ స్టోరీ మాత్రమే ఆడియన్స్ని అలరించనుంది. ఇందులో ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, హిట్ 3 ప్రాంచైజీల్లో మెరిసిన కోమలీ జంటగా నటించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. RX 100 ఛాయలు ఉన్నట్లుగా టాక్ వచ్చింది. అయితే, ఈ ఒక్క సినిమాతోనే ఆడియన్స్ సర్దుకోవడం కష్టమైన పని.

ఈ క్రమంలోనే నేనున్నా అని చెబుతూ.. 'ఓటీటీ ప్లాట్ఫామ్స్' ఆడియన్స్ను అలరించనున్నాయి. వీకెండ్ స్పెషల్గా ఇవాళ (అక్టోబర్ 9న) ఒక్కరోజే 10కి పైగా సినిమాలు తీసుకొచ్చాయి. రేపు శుక్ర, శని, ఆది వారాల్లో మరిన్ని సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ అవ్వనున్నాయి? అనే పూర్తి వివరాలు చూసేద్దాం.  

నెట్‌ఫ్లిక్స్:

వార్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్)- అక్టోబర్ 09

ది ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్)- అక్టోబర్ 09

ది రీసరెక్టెడ్ (మాండరిన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

ది మేజ్ రన్నర్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09

విక్టోరియా బెక్‌హమ్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

కురుక్షేత్ర (తెలుగు డబ్)-అక్టోబర్ 10

మై ఫాదర్ BTK Killer - అక్టోబర్ 10

ఈటీవీ విన్:

మేఘాలు చెప్పిన ప్రేమకథ (తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా)- అక్టోబర్ 09

అమెజాన్ ప్రైమ్:

సాక్వన్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)-అక్టోబర్ 09

జియోహాట్‌స్టార్‌:

మిరాయ్ (ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్)-అక్టోబర్ 10

సన్ NXT:

త్రిబనాధారి బార్బారిక్ (ఫాంటసీ తెలుగు థ్రిల్లర్)- అక్టోబర్ 10

జీ5:

జయమ్ము నిశ్చయమ్మురా (నాగచైతన్యతో జగపతి బాబు)- అక్టోబర్ 10

స్థల్ (సోషల్ డ్రామా) - అక్టోబర్ 10

చౌపల్:

సోచ్ తోహ్ పరే (పంజాబీ రొమాంటిక్ ఫిల్మ్)- అక్టోబర్ 09

డ్రామే ఆలే (పంజాబీ కామెడీ ఫిల్మ్)- అక్టోబర్ 09

సైనా ప్లే ఓటీటీ:

PWD- ప్రపోజల్ వెడ్డింగ్ డివోర్స్ (మలయాళ కామెడీ ఫిల్మ్)- అక్టోబర్ 09

ఈ 10 సినిమాల్లో ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్ 2 మరియు మేఘాలు చెప్పిన ప్రేమకథ సినిమాలు ఇంట్రెసింగ్ గా ఉండనున్నాయి. ఇక మిగతా భాషల్లోని సినిమాలు సైతం స్పెషల్‌గా ఉన్నాయి. అందులో ది రీసరెక్టెడ్, విక్టోరియా బెక్‌హమ్, ది మేజ్ రన్నర్ సినిమాలు సైతం ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉన్నాయి.