బిగ్ బాస్ తెలుగు 9 షో చివరి దశకు చేరుకోవడంతో, ఇంటిలో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. మరో వారం రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఉండటంతో, టాప్ 5 రేసు కోసం ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. నిన్నటి వరకు కలిసి మెలిసి ఉన్నవారంతా ఇప్పుడు కప్పు కోసం పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇచ్చిన ఊహించని టాస్క్ ఇంట్లో తీవ్ర ఉత్కంఠను రేపింది.
యుద్ధంలో ఎవరు ఉండకూడదు?
ఫినాలే రేసులో భాగంగా, 'తర్వాత జరిగే యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి.. ఏ సభ్యుడిని ఎంచుకుంటున్నారో' చెప్పమంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ టాస్క్ హౌస్‌మేట్స్ మధ్య ఉన్న రిలేషన్స్‌ను, వ్యూహాలను బయటపెట్టింది. తొలుత సుమన్ శెట్టి మొదట లేచి, బలమైన కంటెస్టెంట్ అయిన ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పాడు. తరువాత భరణి కూడా ఇమ్మాన్యుయేల్ పేరునే టార్గెట్ చేశాడు. ఎక్కువ పాయింట్స్ ఉండి, టాస్క్‌ల్లో ముందుండే వ్యక్తినే నేను తీయాలనుకుంటాను. ఒకవేళ తను జీరో అయినా, మళ్లీ పాయింట్స్ సంపాదించుకోగలిగే సత్తా ఇమ్మూకి ఉంది అని భరణి తన వ్యూహాన్ని వివరించాడు. దీనికి ఇమ్ము కౌంటర్ ఇస్తూ, "ఒకవేళ కలిసి రాక నేను లీస్ట్‌లో ఉండి ఎలిమినేట్ అయిపోతే, వెళ్లేటప్పుడు హగ్ ఇచ్చి టాటా, బాయ్ బాయ్ చెప్తారు అంతేగా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
సంజన vs పవన్..
సంజన లేచి, ఇమ్మాన్యుయేల్, పవన్ ఇద్దరూ టఫ్ కాంపిటీటర్స్ అని చెప్పింది. అయితే ఒకరి పేరు మాత్రమే చెప్పాలి కాబట్టి, డిమోన్ పవన్ పేరును నామినేట్ చేసింది. తనూజ కూడా ఇమ్ము దగ్గర ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి, ఇమ్మూ పేరునే నామినేట్ చేసింది. అనంతరం లేచిన పవన్, తనను నామినేట్ చేసిన సంజనను రేసు నుంచి తప్పిస్తానని ప్రకటించాడు. "నేను వీక్‌గా ఉండేవాళ్లతో కాకుండా కాంపిటీషన్ ఇచ్చేవాళ్లతో ఆడాలనుకుంటున్నాను" అని పవన్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. కళ్యాణ్ కూడా తాను రేసులో లేకపోయినా, డిజర్వ్ అయ్యేవారే ఉండాలనే ఉద్దేశంతో సంజన పేరును నామినేట్ చేశాడు.
తనూజ, సంజనల మధ్య గొడవ
ఈ చర్చ జరుగుతున్న సమయంలో, ఇమ్మూ సంజనతో .. అందుకే నేను మీకు ఆలోచించి పేరు చెప్పమని చెప్పాను. కానీ మీరు నేను తిట్టాను అనుకున్నారు అని చెప్పాడు. దీంతో టెన్షన్ మరింత పెరిగింది . సంజన వెంటనే మళ్లీ లేచి, "బిగ్ బాస్! నేను నిర్ణయం మార్చుకుంటున్నాను. నేను ఇమ్మూ ఉండొద్దనుకుంటున్నాను అని ప్రకటించింది. దీంతో వెంటనే తనూజ కూడా లేచి, "బిగ్ బాస్ నాది కూడా క్యాన్సిల్. నేను సంజన ఉండొద్దనుకుంటున్నాను" అని చెప్పింది.
"నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, ఎలా మార్చేస్తావు" అంటూ సంజన సీరియస్ అయ్యింది. దానికి తనూజ బదులిస్తూ, "మీరు ఎలా రిలేషన్ అది ఇది అనుకుంటూ ఇమ్ము పేరు చెప్పారో, నేను కూడా అందుకే మార్చుకున్నాను. మీరు చేసిందే నేను చేస్తున్నాను కదా" అంటూ రిప్లై ఇచ్చింది. "నువ్వు నో బాల్ లో సిక్సర్ కొట్టాలనుకుంటున్నావు, నన్ను తీసేయాలనుకుంటున్నావు" అంటూ సంజన తనూజపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫినాలే టికెట్ కోసం పోటీ ఎంత తీవ్రంగా ఉందో, ఈ ఎపిసోడ్ స్పష్టం చేసింది. సభ్యుల మధ్య వ్యక్తిగత సంబంధాల కంటే, గేమ్ వ్యూహాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఫైనల్‌కు ఎవరు వెళ్తారో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు మరి.

