బిగ్ బాస్ సందడి మొదలైంది

బిగ్ బాస్ సందడి మొదలైంది

బిగ్ బాస్ సీజన్ 6 సందడి మొదలైంది. తెలుగు ప్రేక్షకులకు మరో మూడు నెలల పాటు ఫుల్ ఫన్ అందించేందుకు బిగ్ బాస్ వచ్చేశాడు. బిగ్ బాస్ సీజన్ 6 ఇవాళ అట్టహాసంగా ప్రారంభమైంది. 'గెలుపు ఆట‌ మీదున్న ఆస‌క్తి ఉన్న‌వాడిని కాదు..ఆట‌లో ఆశ‌యం ఉన్న‌వాడిని మాత్ర‌మే గెలిపిస్తుంది..ఈ గేమ్‌లో స్నేహాలు, ప్రేమ‌లు ఎన్ని ఉన్నా..ఈ యుద్దంలో ఆత్మ‌విశ్వాస‌మే ఆయుధ‌మైన‌పుడు ప్ర‌శ్నించ‌డానికి, ప్ర‌శంసించ‌డానికి, స‌మ‌ర్థించ‌డానికి, శాసించేందుకు గెలుపున‌కు తోడుగా ఓట‌మికి ధైర్యంగా, అందరికీ అండ‌గా, రాజ్యాన్ని గెలిచే రాజు ఒక్క‌డుంటాడు' అంటూ సాగే వాయిస్ ఓవ‌ర్‌తో బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. "కొత్తగా ట్రై చేయాలంటే నా తర్వాతేరా" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. అనంతరం బంగార్రాజు పాటకు మోడల్స్ తో కలిసి డ్యాన్స్ వేసి నాగ్ అకట్టుకున్నారు.

ఈ షోలో మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ నటీమణి కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్ గా సుదీప, మూడో కంటెస్టెంట్ గా శ్రీహాన్, నాలుగో కంటెస్టెంట్ గా నేహా చౌదరి ఎంట్రీ ఇచ్చారు. ఐదో కంటెస్టెంట్ గా చలాకీ చంటి ఎంట్రీ ఇవ్వగా.. ఇక ఆరో కంటెస్టెంట్ గా శ్రీసత్య , ఏడో కంటెస్టెంట్ గా అర్జున్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఎనిమిదో కంటెస్టెంట్ గా గీతూ రాయల్ ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిదోవ కంటెస్టెంట్ గా అభినయశ్రీ, పదవ కంటెస్టెంట్ గా రోహిత్, పదకొండవ కంటెస్టెంట్ గా మరినా ఎంట్రీ ఇచ్చారు.

పన్నెండవ కంటెస్టెంట్ గా బాలాదిత్య ఎంట్రీ ఇచ్చాడు. పదమూడవ కంటెస్టెంట్ గా వసంతి.. పద్నాలుగొవ కంటెస్టెంట్ గా షానిసాల్మన్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరయ్యారు. పదిహేనోవ కంటెస్టెంట్ గా ఇనాయా సుల్తానా, పదహారవ కంటెస్టెంట్ గా ఆర్జే సూర్య, పదిహేడవ కంటెస్టెంట్ గా ఫైమా ఎంట్రీ ఇచ్చారు. పద్దెనిమిదోవ కంటెస్టెంట్ గా ఆదిరెడ్డి, పంతొమ్మిదవ కంటెస్టెంట్ గా రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చారు.  ఇక ఇరవయో కంటెస్టెంట్ గా ఆరోహి రావు ఎంట్రీ ఇవ్వగా.. ఇరవై ఒకటవ కంటెంస్టెంట్ గా సింగర్ రేవంత్ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టారు.