BMW Trailer Review: ప్రేక్షక మహాశయులకు పండుగ షురూ.. రవితేజ కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయింది

BMW Trailer Review: ప్రేక్షక మహాశయులకు పండుగ షురూ.. రవితేజ కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయింది

సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (BMW). కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవగా, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు ‘బెల్ల బెల్లా’, ‘అద్దం ముందు నిలబడి’, ‘వామ్మో వాయ్యో’ సాంగ్స్ చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ట్రైలర్‌ను గమనిస్తే, ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓ వైపు ఇల్లాలు, మరో వైపు ప్రియురాలు మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపించారు. ఈ పాత్రలో ఆయన చూపించిన ఎమోషన్, ఎనర్జీ కథకు మంచి బలంగా నిలుస్తాయి. రవితేజ మార్క్ ఎనర్జీ, టైమింగ్‌తో కూడిన కామెడీ ట్రైలర్ అంతటా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్ చేసే కంటెంట్‌తో సినిమా రూపొందిందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగిస్తోంది.

ఈ మధ్య గన్నులు, కత్తులు, జాతర ఫైట్లు.. ఇలా తెగ చేసేసాను.. ఇక మా ఫ్యామిలీ డాక్టర్ బ్రేక్ తీసుకోమన్నాడు అంటూ రవితేజ డైలాగ్తో ట్రైలర్ షురూ అయింది. రామ్ లైఫ్లో ప్రేమ, పెళ్లి ఏదైనా సరే.. అది నాతోనే మొదలవుతుంది.. నాతోనే ఎండ్ అవుతుందని డింపుల్ అంటే, ఏ రిలేషన్ అయిన మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది.. అని ఆశికా రవితేజ లైన్ లోకి వచ్చింది. ఇలా వీరిద్దరితో సాగించిన రవితేజ యవ్వారం.. చివరకు ఎలాంటి స్టేజీకి వచ్చిందనేది ఇంట్రెస్టుగా చూపించారు. 

హీరోయిన్స్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ స్టైలిష్ లుక్స్‌తో ఇంప్రెస్ చేయగా, వెన్నెల కిషోర్, సునీల్, మురళి ధర్ గౌడ్ తమదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. మొత్తంగా ట్రైలర్ చూస్తే, ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వెళ్లేలా చేసే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే క్లారిటీ ఇస్తుంది.

కథ విషయానికి వస్తే.. రామ్ పాత్రలో రవితేజ హ్యాపీ మ్యారీడ్ మ్యాన్‌‌‌‌గా కనిపిస్తాడు. అయితే బిజినెస్ పనిమీద స్పెయిన్‌‌‌‌కు  వెళ్లి ఆషికా రంగనాథ్‌‌‌‌తో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఓవైపు భార్య, మరోవైపు ప్రియురాలు ఎమోషన్స్ మధ్య నలిగిపోతూ, గైడెన్స్ కోసం ఒక సైకాలజిస్ట్ (మురళీధర్ గౌడ్‌‌‌‌)ని కలుస్తాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య రామ్ ఎలాంటి నిర్ణయాలతో లైఫ్ ముందుకు ఎలా లాగాడు అనేది మెయిన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే స్క్రీన్ ప్లే, కామెడీ, ఎమోషనల్ సీన్స్ సినిమాకు మెయిన్ అస్సెట్గా నిలిచే ఛాన్స్ ఉంది.