షాకింగ్ ఘటన..ప్లేబాయ్ సర్వీస్ పేరుతో భారీ సైబర్ స్కాం.. పురుషులే వీరి టార్గెట్..భారీగా డబ్బులు సంపాదించొచ్చని తప్పుడు హామీలతో పురుషులను ఆకర్షించి మోసగించిన సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మహిళలను గర్భవతిని చేస్తే రూ.10లక్షల ఇస్తామని చెప్పి.. రీజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో లక్షలు కాజేసిన బిహార్ ముఠా గుట్టు రట్టయింది.
బీహార్‌లోని నవాడ జిల్లాలో ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు.. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, బేబీ బర్త్ సర్వీస్ పేరుతో ఆకర్షణీయమైన పదాలతో పురుషులను ఆకర్షించి లక్షల్లో దండుకున్నారు. ఈ సైబర్ ముఠా వలలో చిక్కుకున్న చాలా మంది భారీమొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నారు. మోసపోయామని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓ మైనర్ తో సహా ఇద్దరునిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసు అధికారుల ప్రకారం..ఈ రాకెట్ లో పురుషులే లక్ష్యంగా మోసాలకు పాల్పడ్డారు. పిల్లలులేని మహిళలను గర్బవతిని చేస్తే.. వారికి రూ.10 లక్షలు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇలా చాలా మంది డబ్బులు సంపాదించారని, వారికి రూ.10లక్షలు చెల్లించినట్లు ఫేక్ ఫ్రూఫ్ చూపించారు.
మోసం ఎలా జరిగిందంటే..
ఈ ముఠా ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యాడ్స్ ఇస్తారు. సులభంగా డబ్బు, ఉచిత సెక్స్ ,హామీతో కూడిన డబ్బులు సంపాదించొచ్చని హామీ ఇచ్చారు. మహిళలను గర్భవతిని చేయకపోయినా, బాధితులకు వాగ్దానం చేసిన మొత్తంలో సగం లభిస్తుందని ఆశ చూపారు.
ఆఫర్ చట్టబద్ధమైనదిగా చూపించడానికి, నిందితులు మహిళా మోడళ్ల ఫోటోలను షేర్ చేశారు. ప్లేబాయ్ సర్వీస్ బేబీ బర్త్ సర్వీస్ వంటి ఆకర్షణీయమైన పదబంధాలతో పురుషులను ఆకర్షించారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు హోటల్ బుకింగ్‌లు , డాక్యుమెంటేషన్ , రిజిస్ట్రేషన్ ఫీజు , అదనపు ఛార్జీలు చెల్లించాలని కోరారు.
రిజిస్ట్రేషన్ ఫీజులు దోపిడీగా..
ఇవన్నీ చెల్లించినా.. మెడికల్ టెస్ట్ లు, అకామిడేషన్, ఐటెండిటీ ఫీజులు వంటి కారణాలతో బాదితులనుంచి అనేకమార్లు డబ్బులు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. మోసం పోయాం అని తెలుసుకునే లోపే.. మొత్తంలో డబ్బును కోల్పోయారు బాదితులు. బయటికి చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందని భయపడి బయటికి చెప్పకపోవడంతో ఈ బిజినెస్ ను మూడు పువ్వులు ఆరుకాయలుగా నడిపించారు మోసగాళ్లు.
నవాడ సైబర్ పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) స్థానిక నివాసి రంజన్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఓ మైనర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇలాంటి కేసు ఇదే మొదటిది కాదు..
ఇలాంటి ఘటనలు గతంలోకూడా జరిగాయి. గతేడాది నవాడ జిల్లాలోనే ఇలాంటి స్కాం బయటపడింది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. గతంలో అరెస్టులు జరిగినప్పటికీ, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆకర్షణ ,ఆన్‌లైన్‌లో పేరు వెల్లడించకపోవడం వల్ల ఇటువంటి మోసాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
