బీహారా మజాకా : హిందీలో ఎంబీబీఎస్ కోర్సు అంట..!

బీహారా మజాకా : హిందీలో ఎంబీబీఎస్ కోర్సు అంట..!

 ఎంబీబీఎస్, ఐటీ కోర్సులు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది ఇంగ్లీష్ భాషలోనే.. ఒకవేళ మాతృ భాషలో ఉంటే.. ఆయా మెడిసిన్స్, వైద్య శాస్త్రంకు సంబంధించిన ఇతర దేశాల పరిశోధనలు వంటి అధ్యయనం చేయటం కష్టం అనే భావన ఇన్నాళ్లు ఉంది.. అందుకే ఇప్పటి వరకు ఎంబీబీఎస్ కోర్సును ఇంగ్లీషులోనే నిర్వహిస్తూ వస్తున్నారు.. హిందీ భాషలో ఎంబీబీఎస్ కోర్సు తీసుకొస్తామని ప్రకటించింది బీహార్ రాష్ట్రం. ఎస్. మీరు విన్నది నిజమే.. హిందీ భాషలో ఎంబీబీఎస్ కోర్సును.. వచ్చే ఏడాది అంటే 2025 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని బీహార్ లోని నితీశ్ కుమార్ సర్కార్ ప్రకటించింది.

 బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ  (MBBS) కోర్సులను హిందీ బాషలో భోధించనున్నారు.  వచ్చే అకడమిక్ సెషన్ నుండి వైద్య విద్యార్థులు హిందీలో MBBS చదివే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే మంగళవారం ప్రకటించారు.

Also Raed:అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి.. మధ్యప్రదేశ్ లో మూడేళ్లలో 31 వేల మంది మిస్సింగ్..

 ఆరోగ్య శాఖ మంత్రి స్పందిస్తూ  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ఆరోగ్య శాఖ, MBBS కోర్సు కోసం హిందీ పాఠ్యపుస్తకాలలో లభ్యం కానున్నాయిన తెలిపారు. క్షుణ్ణంగా చర్చించిన తర్వాత ఈ చారిత్రాత్మక చర్యను తీసుకుందన్నారు. ఈ నిర్ణయం హిందీని ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యంతో సమానంగా ఉంటుందన్నారు .