బీహార్ రాష్ట్ర సర్పంచుల పర్యటన

బీహార్ రాష్ట్ర సర్పంచుల పర్యటన

మెదక్, వెలుగు: నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ, నారాయణపూర్ గ్రామాలను గురువారం బీహార్ రాష్ట్రం గయ జిల్లాకు చెందిన 100 మంది సర్పంచుల బృందం పర్యటించింది. తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు,  గ్రామ పరిపాలన అంశాలపై అధ్యయనం చేయడానికి వచ్చారు. సర్పంచుల బృందం గ్రామంలో నర్సరీ, డంప్ యార్డ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ఇంకుడు గుంతలు, స్టీల్ బ్యాంకు, తడి పొడి చెత్త వేరు చేసే విధానం, మద్యపాన నిషేధం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి  తెలుసుకొన్నారు.  

ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా జరుగుతున్న ప్రగతిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎల్ పీవో సాయిబాబా, ఎంపీడీవో మధులత, ఏపీఎం గౌరీశంకర్, సీసీలు దేవీ సింగ్, భాగ్య, ఐసీడీఎస్​ సూపర్​వైజర్​ కవిత, పంచాయతీ కార్యదర్శులు మల్లేశం లక్ష్మణ్, వంశీకృష్ణ, నాగేశ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీఏలు పర్వతాలు, మాధవి పాల్గొన్నారు