రూ.1.30 కోట్లతో బైక్​ షోరూమ్ డీలర్ పరార్

రూ.1.30 కోట్లతో బైక్​ షోరూమ్ డీలర్ పరార్

సికింద్రాబాద్, వెలుగు: తక్కువ ధరకే హోండా యాక్టివా బైకులు ఇస్తామంటూ ఓ డీలర్ కస్టమర్లను మోసం చేసి రూ.1.30 కోట్లతో పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి నెల రోజుల అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆదివారం షోరూం వద్ద ఆందోళనకు దిగారు. నాచారం పోలీస్​స్టేషన్​పరిధిలోని మల్లాపూర్ కు చెందిన రమణారెడ్డి స్థానికంగా ఆర్ఆర్ మోటర్స్ పేరుతో బైక్​షోరూం నిర్వహిస్తున్నాడు.

మార్కెట్ రేటు కంటే రూ.20 వేలు తక్కువకు హోండా యాక్టివా బైకులు ఇస్తామని ప్రచారం చేశాడు. నమ్మిన చాలా మంది అతనికి డబ్బు చెల్లించారు. ఇలా ఒక్కొక్కరి నుంచి  రూ.80వేలు దాకా వసూలు చేశాడు. మరో వ్యక్తికి షోరూమ్​లో పార్టనర్​షిప్​ఇస్తానని చెప్పి రూ.32 లక్షల వసూలు చేశాడు. తర్వాత కస్టమర్లకు బైకులు ఇవ్వకుండా తప్పించుకు తిరిగాడు. చివరికి రమణారెడ్డి పరారైనట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రమణారెడ్డిని అరెస్ట్ చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు ఆందోళనకు దిగారు. దాదాపు రూ.1.30కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.