ఫ్యామిలీతో చూడాల్సిన చిత్రం బైకర్

ఫ్యామిలీతో చూడాల్సిన చిత్రం బైకర్

శర్వానంద్, మాళవిక నాయర్ జంటగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘బైకర్‌‌‌‌‌‌‌‌’. రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ కీలకపాత్ర పోషించారు.  యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ గురించి తెలియజేసేందుకు ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించారు.  హీరో శర్వానంద్ మాట్లాడుతూ ‘యూవీ క్రియేషన్స్‌‌‌‌లో ఇది నాకు నాలుగో హిట్. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నేనిలా 22  కిలోలు బరువు తగ్గి ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్ అవ్వడానికి దర్శకుడు చెప్పిన స్టోరీ ఇన్‌‌‌‌స్పైర్‌‌‌‌‌‌‌‌ చేసింది.

తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని గర్వంగా చెప్పుకుంటా. రేసింగ్ సీక్వెన్స్‌‌‌‌లు అద్భుతంగా రావడానికి యాక్షన్ మాస్టర్ దిలీప్,  డీవోపీలు యువరాజ్, మది కారణం. అలాగే జిబ్రాన్ మ్యూజిక్ ఇంకా నా చెవుల్లో మార్మోగుతోంది. మాళవిక బెస్ట్ పెర్ఫార్మర్. రాజశేఖర్ గారి లాంటి సింపుల్, ప్యూర్ హార్టెడ్ వ్యక్తిని నేను చూడలేదు. ఇక ఈ సినిమాను యూత్‌‌‌‌  చూస్తున్నారు. అయితే ఇందులో స్పోర్ట్స్ డ్రామాతో పాటు తండ్రీ-కొడుకుల ఎమోషన్ ఉంది. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్.  పిల్లలతో కలిసి సినిమా చూడండి. మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’ అని చెప్పారు.

రాజశేఖర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం దర్శకుడు అషిలాష్ రెడ్డి. అందుకు నిర్మాతలు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ఎంతో మంచి ఎమోషన్ ఉంది. జీవితంలో కొందరిపై మనకు ప్రేమ ఉన్నా వ్యక్తపరచకుండా, చిన్న చిన్న మనస్పర్థలతో వాళ్లతో దూరమవుతాం. మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే జీవితం చాలా హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు కూడా అదే ఫీల్ వచ్చింది’ అని చెప్పారు.  శర్వానంద్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో బెస్ట్ సినిమా ‘బైకర్‌‌‌‌‌‌‌‌’  అని అతిథిగా హాజరైన దర్శకుడు సంపత్ నంది చెప్పారు.  హీరోయిన్ మాళవిక నాయర్, డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, డీవోపీ యువరాజ్, నిరూప్ నందకుమార్, ఎడిటర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.