
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై బీజేపీ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫుల్ టైమర్స్ (విస్తారక్)ను నియమించిన పార్టీ.. వారు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు బైక్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది.
పార్టీ స్టేట్ ఆఫీసుకు సుమారు 90 హీరో హోండా షైన్ బైక్‌లు వచ్చాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే విస్తారక్‌లకు ఇవ్వనున్నారు.