హైదరాబాద్ లాంటి బిజీ రోడ్లలో కార్ లో వెళ్తున్నపుడు సడెన్ గా కారు సైడ్ మిర్రర్ నుంచి బయటికొస్తే ఏం చేస్తారు..? ఆ టైమ్ లో ఎవరైనా టెన్షన్ కు గురై స్టీరింగ్ వదిలిపెట్టే పరిస్థితి ఉంటుంది. సడెన్ గా బ్రేకులు వేసి బయట పడిపోదాం అనుకుంటాం. సేమ్ అలాంటి ఇన్సిండెంటే తమిళనాడులో జరిగింది.
మంగళవారం (నవంబర్ 11) తమిళనాడులోని నమక్కల్-సాలెం రోడ్డులో వెళ్తున్న ఓ కార్ డ్రైవర్ కు ఒక పాము సడెన్ షాకిచ్చింది. మార్గ మధ్యలో సైడ్ మిర్రర్ నుంచి బుసలు కొడుతూ బయటికిరావడం భయభ్రాంతులకు గురిచేసింది. మిర్రర్ లో దూరిన పాము బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుండగా.. పట్టు దొరకకపోవడంతో కాసేపు మెలికలు తిరిగింది. అది గమనించిన బైకర్స్ పాము పాము అని అరుస్తూ వెళ్లిపోయారు.
గమనించిన కార్ డ్రైవర్ వెంటనే కారును పక్కకు ఆపేసి కిందికి దిగాడు. స్నేక్ క్యాచర్స్ కు సమాచారం అందించడంతో పామును మిర్రర్ నుంచి తొలగించారు. ఆ సమయంలో రోడ్డు పైన ప్రయాణికులు భారీగా గుమిగూడారు.
ఈ సందర్భంగా చలికాలంలో వెహికిల్స్ స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకోవాల్సిందిగా చెబుతున్నారు. చలితీవ్రతకు తట్టుకోలేక పాములు వెచ్చని ప్రదేశాలను వెతుకుతాయని.. అందులో భాగంగా కార్లు, బైకులలో తలదాచుకుంటాయని స్నేక్ క్యాచర్స్ తెలిపారు. అందువలన ముందుగానే చెక్ చేసుకోవాలని సూచించారు.
Snake stuck in car's side mirror!
— Siraj Noorani (@sirajnoorani) November 11, 2025
Shocked driver and others.
Incident in #TamilNadu!#Snake #Car #viralvideo #UANow pic.twitter.com/OlLYj9DBYP
