జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 40.20 శాతం నమోదయ్యింది. తమను పోలింగ్ స్టేషన్ల దగ్గరకు రాకుండా అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ఈ క్రమంలో సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయ సానుభూతి ప్రకటనలు కందిస్తున్నామని అన్నారు. సునీత వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లేనని అన్నారు పొన్నం. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థి తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు పొన్నం.
ప్రజలు తమ ఇష్టానుసారం ఓటు వేసే హక్కు ఉందని.. పోలింగ్ టైంలో స్థానికేతర నేతలు ఉంటే కేసు పెట్టాలని అన్నారు. అయితే.. ఉదయం పోలింగ్ కాస్త నెమ్మదిగా జరిగినా.. గంట గంటకి నెమ్మదిగా ఓటింగ్ శాతం పెరుగుతోంది. మధ్యాహ్నం వచ్చే వరకు పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి వరకు 40.20 శాతం పోలింగ్ నమోదయ్యింది. చివరి రెండు గంటల్లో సాయంత్రం 4 నుంచి 6 వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
►ALSO READ | నిజామాబాద్ ప్రగతి ఆసుపత్రిలో.. మహిళ డెడ్ బాడీపై 18 గ్రాముల బంగారం మాయం
మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్బలగాలను మోహరించగా.. 1,761 మంది పోలీసులు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు.
