అక్షయ్‌కుమార్, అర్షద్ వార్సీ లీడ్ రోల్స్‌లో రూపొందిన రీసెంట్ హిందీ మూవీ ‘‘జాలీ LLB3’. ఇప్పటికే ఈ కోర్టు రూమ్ డ్రామా ఫ్రాంచైజీలో రెండు సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో 2025 సెప్టెంబర్ 19న రిలీజైన మూడో పార్ట్ జాలీ LLB3 సైతం.. సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది.
అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన ఈ సినిమాను సుభాష్ కపూర్ డైరెక్ట్ చేశాడు. అక్షయ్‌కు జంటగా హ్యూమా ఖురేషి, అర్షద్‌కు జంటగా అమృతా రావ్ నటించారు. అలోక్ జైన్, అజిత్ అంధారే నిర్మించారు. ఈ సినిమా యూపీలోని రెండు ఊళ్లలో 2011లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కించారు.
‘జాలి LLB3’ OTT:
అక్షయ్‌కుమార్ నటించిన బ్లాక్‌బస్టర్ లీగల్ కామెడీ ‘జాలి LLB3’ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది. ఒకేసారి రెండు ఇండియా దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లలో స్ట్రీమింగ్ అవ్వనుంది. Netflix (నెట్‌ఫ్లిక్స్) మరియు JioHotstar (జియో హాట్ స్టార్)లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్కి రానుంది.
రియల్ ఇన్సిడెంట్స్తో తెరకెక్కిన ఈ సినిమా న్యాయం కోసం జరిగే ఓ పోరాటం. ఇందులో రాజకీయాలు, సామాజిక సమస్యలపై చర్చిస్తూనే ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ ఇద్దరూ న్యాయవాదులుగా అద్భుతంగా నటించారు. కోర్టులో వీళ్లిద్దరి మధ్య సాగే వాదోపవాదాల నేపథ్యంలో సాగే డబుల్ ట్రబుల్ కామెడీతో, ఆలోచింపజేస్తూనే నవ్వులు పూయించారు. జడ్జి పాత్రలో సౌరబ్ శుక్లా ఆకట్టుకుంటారు. మరో అడ్వకేట్‌గా అన్ను కపూర్ కీలకపాత్ర పోషించి మెప్పిస్తుంది.
కథేంటంటే:
రాజస్థాన్‌లోని బికనేర్‌లో ఒక ధనవంతుడైన పారిశ్రామికవేత్తకు.. వ్యతిరేకంగా స్థానిక రైతులు చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. ఓ ధనవంతుడైన పారిశ్రామికవేత్త హరిభాయ్ (గజరాజ్) రాక్షస ప్రయత్నాన్ని ఆ ఊరి వ్యవసాయదారులందరూ వ్యతిరేకిస్తారు.
ఈ క్రమంలో ఓ పేద రైతు రాజారామ్ సోలంకి దగ్గర నుండి వ్యాపారి హరిభాయ్ బలవంతంగా తన భూమిని స్వాధీనం చేసుకుంటాడు. దాంతో రాజారామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. భూమి పత్రాలు ఫోర్జరీ అయ్యాయని రైతు కోడలు జానకి వాదించినా పట్టించుకోరు.
అలా ప్రభుత్వాధికారులు తన చేతిలో ఉండడంతో రకరకాల మతలబులు చేసి అందరీ భూములను దక్కించుకుంటాడు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వారికి.. ఇద్దరు జాలీలు (అక్షయ్, అర్షద్) కలిసి ఎలా సహాయపడ్డారు? అందుకోసం వారు ఎలాంటి సందర్భాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది “జాలీ ఎల్.ఎల్.బి 3” కథ.
