బిహార్‌‌‌లో రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు.. రికార్డ్ స్థాయిలో పోలింగ్

బిహార్‌‌‌లో రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు.. రికార్డ్ స్థాయిలో పోలింగ్

పాట్నా: రెండో విడత బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 60.40 శాతం ఓటింగ్ నమోదైంది. ఈరోజు ఎన్నికలు జరిగిన 18 జిల్లాల్లో.. మధ్యాహ్నం 3 గంటల వరకూ కిషన్‌గంజ్‌లో అత్యధికంగా 66.10 శాతం పోలింగ్ నమోదైంది. పూర్నియా (64.22%), జముయి (63.33%), కతిహార్ (63.80%), గయాలో 62.74 శాతం పోలింగ్ నమోదైంది. కౌముర్ (భాబువా) (62.26%), సుపాల్ (62.06%), పశ్చిమ చంపారన్ (61.99%), పూర్వి చంపారన్లో 61.92% పోలింగ్ నమోదు కావడం విశేషం.

నవాడలో అత్యల్పంగా 53.17% పోలింగ్ నమోదైంది. అరారియా (59.80%), బగల్పూర్ (58.37%), సీతామర్హి (58.32%), అర్వాల్ జిల్లాలో 58.26 శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఓవరాల్గా ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 122 నియోజకవర్గాల్లో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య మంగళవారం తెల్లవారుజామున పోలింగ్ ప్రారంభమైంది.

బిహార్‌‌‌లో మొదటి దశలో 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డ్ స్థాయిలో 64.66 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక పోలింగ్ శాతమని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 18 జిల్లాల్లో ఎలక్షన్ జరగ్గా.. అత్యధికంగా ముజఫర్ పూర్లో అత్యధికంగా 70.96 శాతం ఓటింగ్ జరిగింది. అలాగే సమస్తిపూర్లో 70.63, మాధేపురాలో 67.21, వైశాలిలో 67.37, సహర్సాలో 66.84, ఖగాడియాలో 66.36, లఖీసరాయ్ లో 65.05 శాతం పోలింగ్ రికార్డ్ అయింది.

బిహార్‌‌‌లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తొలి దశలో 121 సీట్లకు ఎన్నికలు నిర్వహించారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇవాళ (మంగళవారం) రెండో విడతలో 122 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెల్లడిస్తారు.