‘డబుల్’ ఇండ్ల బిల్లులు రిలీజ్

‘డబుల్’ ఇండ్ల బిల్లులు రిలీజ్
  • రూ. 800 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపు
  • గ్రేటర్ కు రూ. 300 కోట్లు, జిల్లాలకు రూ. 500 కోట్లు 
  • రాష్ట్ర వ్యాప్తంగా మరో రూ.200 కోట్లు పెండింగ్  
  • పైరవీ చేస్కున్న కాంట్రాక్టర్లకే బిల్లులు

హైదరాబాద్ వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌‌‌ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు విడుదల అయ్యాయి. ఈ ఏడాది మార్చి వరకు కటాఫ్ డేట్ గా తీసుకొని మొత్తం రూ.800 కోట్లు విడుదల చేసినట్లు హౌసింగ్ అధికారులు వెల్లడించారు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఈ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, గ్రేటర్ కు రూ.300 కోట్లు, జిల్లాలకు రూ.500 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్)  నుంచి రూ.2 వేల కోట్ల లోన్ కోసం గత 6 నెలల నుంచి హౌసింగ్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం రూ. 1000 కోట్లు అయినా ఇవ్వాలని జూన్ లో హౌసింగ్ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ ఢిల్లీకి వెళ్లి హడ్కో డైరెక్టర్లను కలిసి విన్నవించారు. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న లోన్లను ప్రభుత్వ లోన్లుగానే పరిగణిస్తామని ఇటీవల కేంద్రం, ఆర్బీఐ స్పష్టం చేయటంతో ఈ లోన్లకు బ్రేక్ పడింది. అయితే, వారం క్రితం రూ.800 కోట్ల లోన్ రావటంతో ఏడాదిన్నర పెండింగ్ లో ఉన్న బిల్లులను హౌసింగ్, జీహెచ్ఎంసీ అధికారులు క్లియర్ చేశారు. బిల్లుల విడుదలలో పక్షపాతం బిల్లులను రిలీజ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి చూపుతోంది. ఇండ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వాల్సి ఉన్నా.. కేవలం పైరవీ చేసుకున్న వారికే పెండింగ్‌‌ బిల్లులు రిలీజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఒకరిద్దరు కీలక మంత్రులు తమకు సన్నిహితులయిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీపై ఒత్తిడి తెచ్చినట్లు అధికార వర్గాల్లో చర్చ జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే వైఖరిని ప్రదర్శిస్తోందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

చిన్న సంస్థలకే ఆపుతున్రు 

ఈ ఏడాది చివరి నాటికి ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు
అయితే, స్థానిక పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేస్తుండటంతో వారు రాష్ట్రంలోని చాలా చోట్ల ఇంటి నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. ఇండ్లు పూర్తిగా కట్టినవారికి కూడా బిల్లులు ఇవ్వకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. పెద్ద సంస్థలు, కాంట్రాక్టర్లకు బిల్లులను విడుదల చేస్తున్న ప్రభుత్వం చిన్న సంస్థలు, కాంట్రాక్టర్లకే పెండింగ్ లో పెడుతోందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. 

పూర్తయిన ఇండ్లు 1.13 లక్షలు 
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,13,535 డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వంద శాతం పూర్తయ్యింది. 69,488 ఇండ్లు దాదాపు పూర్తికావొచ్చాయి. వీటితో పాటు 46,428 ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఉందని హౌసింగ్ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో చాలా చోట్ల పనులను కాంట్రాక్టర్లు ఎక్కడివక్కడే ఆపేసినట్టు తెలుస్తోంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌ పరిధిలోనే 56,066 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, 90 శాతం పూర్తయిన ఇండ్లు 29,763 ఉన్నాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7,000 ఇండ్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ఈ ఏడాదిలో 4,500 ఇండ్లను అందజేసినట్టు అధికారులు వెల్లడించారు. మిగతా ఇండ్లు పూర్తయినా, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వనందుకే‌‌‌‌‌ బిల్లులు ఇవ్వనందుకే ప్రభుత్వం వాటిని పంపిణీ చేయడం లేదని హౌసింగ్ అధికారుల్లో చర్చ జరుగుతోంది.  

గ్రేటర్​కు ఇంకా 150 కోట్లు పెండింగ్  

డబుల్ బెడ్రూం ఇండ్ల బిల్లులకు సంబంధించి జీహెచ్ఎంసీలో మొత్తం రూ. 450 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. ఇటీవల రూ. 300 కోట్ల బిల్లులను విడుదల చేసినం. ఇంకా రూ.150 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. హడ్కో లోన్ మరింత రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత మిగతా బిల్లులు క్లియర్ చేస్తం.   

- సురేశ్ , సీఈ, జీహెచ్ఎంసీ