ఆగస్టు 23న బింబిసార

ఆగస్టు 23న బింబిసార

కళ్యాణ్ రామ్ కెరీర్‌‌‌‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘బింబిసార’. మల్లిడి వశిష్ట్ దర్శకుడు. కేథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్.  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌పై కె.హరికృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 5న విడుదలవుతోంది. ఈరోజు కళ్యాణ్​రామ్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే ట్రైలర్‌‌‌‌ను లాంచ్ చేశారు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘చిన్నప్పుడు ఎన్నో చందమామ కథలు చదివాం. సినిమా రూపంలో వెండితెరపై చూశాం. అదే తరహాలో టైమ్ ట్రావెల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న చిత్రమే ‘బింబిసార’. ఇదొక ఫ్రాంచైజీ. నాలుగు పార్టులు ప్లాన్ చేశాం.  నెక్స్ట్‌‌ ఫ్రాంచైజీలో ఎన్టీఆర్‌‌‌‌ కూడా ఉండే చాన్స్ ఉంది.  పార్ట్2 నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 23న  రిలీజ్ అనుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్‌‌ని కచ్చితంగా యాభై రోజుల తర్వాతే ఓటీటీకి ఇస్తాం. ఈ ఇయర్ మా తాతగారి వందో జయంతి కనుక ఈ చిత్రాన్ని ఆయనకి అంకితం ఇస్తున్నాం’ అని చెప్పాడు.

‘ఈ మూవీలో పార్ట్ అవడం హ్యాపీగా ఉంది. ఐరా అనే పాత్ర పోషించా. ఫస్ట్ టైమ్ పీరియాడికల్ డ్రామాలో నటించాను. చాలా ఎక్సైటింగ్‌‌గా ఉంది’ అంది కేథరీన్ థ్రెసా. ‘షూటింగ్ మొదటి రోజున కళ్యాణ్ రామ్ గారి గెటప్‌‌, ఆయన కళ్లు చూస్తే నిజమైన కింగ్‌‌లా కనిపించారు. తెలుగువారు నాపై చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్’ అని చెప్పింది సంయుక్తా మీనన్. దర్శకుడు మాట్లాడుతూ ‘బింబిసారుడి చరిత్రకీ దీనికి ఎలాంటి సంబంధం లేదు. కానీ కొన్ని పోలికలు ఉంటాయి. ఈ బింబిసారుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఆగస్ట్ 5న చూస్తారు’ అన్నాడు. నటుడు శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ తమ్మిరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.