జూబ్లీహిల్స్ ఎన్నికల ఎఫెక్ట్: వంద మంది రౌడీ షీటర్ల బైండోవర్.. బోరబండలో 74 మంది

జూబ్లీహిల్స్ ఎన్నికల ఎఫెక్ట్: వంద మంది రౌడీ షీటర్ల బైండోవర్.. బోరబండలో 74 మంది

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా పోలీసులు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లపై నిఘా పెంచారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో సోమవారం (అక్టోబర్ 27) వంద మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. 

నియోజకవర్గంలో బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు పోలీసులు. మరోవైపు మధురా నగర్ స్టేషన్ లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్ తో సహా 19 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.

నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎలంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల వేళ కేసులు నమోదు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

►ALSO READ | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడితే BRS భూస్థాపితమే: ఎంపీ చామల