
హైదరాబాద్: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఐకాన్ సీజన్ 2 విజేతగా ఎనిమిదేళ్ల బినితా చెట్రి నిలిచింది. గ్రాండ్ ఫినాలేలో అద్భుతమైన ప్రదర్శనతో డాన్స్ ఐకాన్ సీజన్ 2 టైటిల్ కైవసం చేసుకుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ చీఫ్‌గెస్ట్‌గా హాజరై ఈ యువ డ్యాన్సర్‌కు ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అందజేశారు. టైటిల్‌తో పాటు విజేతకు ఆహా ఓటీటీ రూ.5 లక్షలను బహుమతిగా అందించారు. గ్రాండ్ ఫినాలేకు సీనియర్ నటి రమ్య కృష్ణ ప్రత్యేక అతిథిగా హాజరై శేఖర్ మాస్టర్, ఫరియాతో కలిసి న్యాయనిర్ణేత ప్యానెల్‌లో కూర్చొని సందడి చేశారు.
2025 ఫిబ్రవరిలో డాన్స్ ఐకాన్ సీజన్ 2 మొదలైంది. ఈ షోకు ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా సందడి చేయగా.. నటి ఫరియా అబ్దుల్లా, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, అంతరిక్షం అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. విపుల్ కాండ్పాల్, సాధ్వి మజుందార్, బినితా చెట్రీ, షోనాలి, బర్కత్ అరోరా సీజన్ లో కంటెస్టెంట్లు కాగా.. వీరికి ఐదుగురు మెంటార్స్‌గా మానస్, దీపిక, జాను లైరి, ప్రకృతి, యష్ మాస్టర్ వ్యవహరించారు. పంచభూతాలు అనే విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందడంతో ఈ షోను ప్రేక్షకులు బాగా ఆదరించారు.
►ALSO READ | AlluArjun: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఉత్కంఠ.. అట్లీ ప్రాజెక్టులో బన్నీ కొత్త అవతారం
ఈ సీజన్ విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలైన బినిత యష్ మాస్టర్ మార్గదర్శకత్వంలోఅద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చింది. వారం వారం తన ప్రదర్శన మరింత మెరుగుపర్చుకుని అభిమానులకు దగ్గరైంది. తన నృత్యం ద్వారా శక్తివంతమైన కథనాలను తెలియజేయగల సామర్థ్యం బినితను విజేతగా నిలిపింది. బినిత విజయం ఆమె ప్రతిభకు ఒక వేడుక మాత్రమే కాదు, యువ ప్రదర్శనకారులను పెంపొందించడానికి ఆహా సృష్టించిన వేదికకు కూడా నిదర్శనం.