
‘పుష్ప2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ దర్శకత్వంలో ఇటీవల సినిమాను అనౌన్స్ చేయగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమాపై ఆసక్తిని పెంచిన మేకర్స్.. అల్లు అర్జున్ లుక్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ఓసారి లుక్ టెస్ట్ నిర్వహించగా, మరోసారి సెకండ్ లుక్ టెస్ట్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో ఓ లుక్ కోసం హెవీ ప్రోస్తెటిక్స్ మేకప్ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.
►ALSO READ | Mega 157: అఫీషియల్: మెగాస్టార్తో మరోసారి నయనతార.. చిరంజీవి పాట, డైలాగ్‍తో రప్ఫాడిస్తూ స్పెషల్ ఎంట్రీ
క్యారెక్టర్‌కు తగ్గట్టు డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించాలని బన్నీ కూడా ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. పైగా ఈ చిత్రంలో మల్టిపుల్ గెటప్స్‌లో అల్లు అర్జున్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం స్పెషల్ ట్రైనర్‌ను పెట్టుకుని కసరత్తులు చేస్తున్నాడు బన్నీ.
మరోవైపు ఈ సినిమా పునర్జన్మ కాన్సెప్ట్‌తో తెరకెక్కనుందని, హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, అనన్య పాండేలను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇది అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా. ఈ ఏడాది చివరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Sun Pictures 🤝 @alluarjun 🤝 @Atlee_dir
— Sun Pictures (@sunpictures) April 8, 2025
Crossing Borders. Building Worlds. 💥🔥#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥
🔗 - https://t.co/NROyA23k7g#AA22 #A6 #SunPictures pic.twitter.com/2Cr3FGJ9eM
AA22 మూవీ:
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అల్లు అర్జున్ బర్త్‌డే (ఏప్రిల్ 8) సందర్భంగా స్పెషల్ వీడియోతో ఈ క్రేజీ కాంబోను అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఇందులో చూపించారు. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంచనా. అందులో రూ.200 కోట్ల నిర్మాణ వ్యయంతో పాటు రూ.250 కోట్ల VFX పనులకు కేటాయిస్తున్నట్లు సమాచారం.