Mega 157: అఫీషియల్: మెగాస్టార్తో మరోసారి నయనతార.. చిరంజీవి పాట, డైలాగ్‍తో రప్ఫాడిస్తూ స్పెషల్ ఎంట్రీ

Mega 157: అఫీషియల్: మెగాస్టార్తో మరోసారి నయనతార.. చిరంజీవి పాట, డైలాగ్‍తో రప్ఫాడిస్తూ స్పెషల్ ఎంట్రీ

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబో నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. మెగా 157 వర్కింగ్ టైటిల్తో వస్తోన్న ఈ మూవీలో చిరుకు జోడీని ప్రకటించారు. నేడు (మే17న) మెగా 157 సినిమాకు లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా ఫిక్స్ చేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియో అనిల్ స్టైల్లో ఆసక్తిగా సాగింది. నయనతార సెట్కు కారులో వస్తుండటం.. అప్పుడు ఆ కారులో 'స్టార్ స్టార్ మెగాస్టార్' అని సాంగ్ రావడం, ఆ వెంటనే మీరు చిరుతో మూవీ చేస్తున్నారా అని డ్రైవర్ అడగ్గా.. మూవీ స్క్రిప్ట్ చదివి వెరీ ఎంటర్‌టైనింగ్.. హలో మాస్టారు.. కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అంటూ మెగాస్టార్ స్టైల్‍లో డైలాగ్ చెప్పి.. నయన్ మెగా 157బోర్డుకు స్వాగతం పలికింది.

ఇదిలా ఉంటే.. చిరంజీవితో కలిసి నయనతార నటించడం ఇది మూడోసారి. సైరా నరసింహా రెడ్డి మూవీలో చిరుకు భార్యగా నటించింది. ఆ తరువాత గాడ్ ఫాదర్ (2022)లో సిస్టర్ క్యారెక్టర్ చేసింది. ఇపుడు మెగా 157 మూడోది కానుంది. 

ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అనిల్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అంచనాలు పెరిగిపోయాయి. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారు. ఈ రోల్ కోసం నయన్ రూ.18 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, నయనతార బాలీవుడ్‌ మూవీ జవాన్‌ కోసం రూ.12 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ జూన్ లో మొదలు కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈచిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.