మొక్కజొన్న వ్యర్థాలతో బయోడీజిల్​

మొక్కజొన్న వ్యర్థాలతో బయోడీజిల్​

సంగారెడ్డి, వెలుగు: మొక్కజొన్న వ్యర్థాలకు ఉప్పు, చక్కెర, సల్ఫ్యూరిక్​యాసిడ్​కలిపి అతి తక్కువ ఖర్చుతో బయోడీజిల్​తయారు చేసే కొత్త పద్ధతిని ఐఐటీ హైదరాబాద్​రీసెర్చర్లు కనుగొన్నారు.  ఈ ఇంధనాన్ని ఆటో మొబైల్, ఏవియేషన్​ రంగాల్లో ఉపయోగించుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.2030 నాటికి కార్బన్​డైయాక్సైడ్​ ఉద్గారాలలో 3.5 శాతం, ప్రపంచ చమురు డిమాండ్​లో 15 శాతం ఉన్న  గ్లోబల్​ ఏవియేషన్​ రంగం 2050 సంవత్సరం వచ్చే నాటికి 50 శాతం కార్బన్​ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకుందని వారు  చెప్పారు.

పర్యావరణ అనుకూలమైన బయోడీజిల్​తో కార్బన్​ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చని, అందువల్ల భవిష్యత్​లో మొక్కజొన్న రైతులకు స్థిరమైన లాభాలు ఉంటాయన్నారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్, మెటీరియల్​ సైన్స్​ అండ్​ మెటలర్జికల్​ ఇంజనీరింగ్​ విభాగం అసిస్టెంట్​ప్రొఫెసర్​ డాక్టర్​ సురేశ్ దేశ్ పాండే, కెమికల్ ఇంజనీరింగ్​ విభాగం ప్రొఫెసర్​ సునీల్​కుమార్, పరిశోధన విద్యార్థులు దామోదర్, అలేఖ్య, మోహన్ ల టీమ్​ ఈ ఎక్స్​పెరిమెంట్​చేశారు. వీరిని ఐఐటీ హెచ్​ డైరెక్టర్ యూబీ దేశాయ్ అభినందించారు.