బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మూసివేత.. డిజైన్ లోపాలుంటే సరిచేస్తాం: కేటీఆర్

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మూసివేత.. డిజైన్ లోపాలుంటే సరిచేస్తాం: కేటీఆర్

హైదరాబాద్‌లోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం తనను కలచి వేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అతి వేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోందని అన్నారాయన. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. సరైన భద్రతా ప్రమాణాలను తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వెంటనే ప్రమాదం జరిగిన ఫ్లైఓవర్‌ను మూసేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్-చీఫ్‌లకు ఈ మేరకు ఆదేశాలిచ్చామని చెప్పారు. స్పీడ్ కంట్రోల్ సహా అన్ని భద్రతా చర్యలను తీసుకోవాలని సూచించామన్నారు. ఇంజినీర్లు, నిపుణుల కమిటీ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను పరిశీలిస్తారని తెలిపారు కేటీఆర్. డిజైన్ లోపాలపై సమీక్షిస్తారని చెప్పారు.

MORE NEWS: 

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైనుంచి పల్టీకొట్టిన కారు

గేమ్ ఆఫ్ థ్రోన్స్‌కు మించిన డ్రామా, ట్విస్టులు

లిమిట్ 40 అయితే 100 స్పీడ్‌తో వెళ్లారు

సైన్ బోర్డుల్లో స్పీడ్ లిమిట్ 40 కిలీమీటర్లు కాగా, 100 కిలీమీటర్ల వేగంతో కారు దూసుకెళ్లిందని కేటీఆర్ చెప్పారు. ఇదే ప్రమాదానికి కారణమని అన్నారు. ఈ ప్రమాదంతో అసలు సంబంధం లేని ఓ అమాయకురాలి ప్రాణం పోవడం బాధాకరమని అన్నారు. మళ్లీ ప్రమాదాలు జరగకుండా డిజైన్ లోపాలు ఏవైనా ఉంటే సరిచేస్తామని తెలిపారు కేటీఆర్.