జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి: జి.చంద్రశేఖర్రెడ్డి

జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి: జి.చంద్రశేఖర్రెడ్డి

జీడిమెట్ల, వెలుగు: జీవవైవిధ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని స్టేట్​చీఫ్​ఇన్​ఫర్మేషన్​కమిషనర్​జి.చంద్రశేఖర్​రెడ్డి అన్నారు. దూలపల్లిలోని ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ఫారెస్ట్​ బయో డైవర్సిటీ ప్రాంగణంలో శుక్రవారం చెట్ల పెంపకం మేళా జరిగింది. ఆయన హాజరై మాట్లాడారు. శాస్త్రవేత్తలను, రైతులను ఒకే వేదిక పైకి తెచ్చి చెట్ల పెంపకం మేళా నిర్వహించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో ఐసీఎఫ్​ఆర్​సీ -ఐఎఫ్​బీ డైరక్టర్​ ఈ.వెంకట్​రెడ్డి, డాక్టర్​ సుధీర్​కుమార్​, డాక్టర్​ పట్నాయక్​, సందీప్​, దాక్టర్​ పంకజ్​ సింగ్​ తదితరులు పాల్గొన్నారు.