Kiran Kumar : టాలీవుడ్‌లో విషాదం.. అనారోగ్యంతో 'కేజేక్యూ' దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూత.

Kiran Kumar : టాలీవుడ్‌లో విషాదం.. అనారోగ్యంతో 'కేజేక్యూ' దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూత.

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. వైవిధ్యమైన మేకింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యువ దర్శకుడు కిరణ్ కుమార్ బుధవారం ఉదయం కన్ను మూశారు.  గత కొంత కాలంగా త్రీవ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కిరణ్ మృతితో సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి.  తన కలల ప్రాజెక్ట్ థియేటర్లలోకి రావడానికి ముందే ఆయన మరణించడం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

విషాదంలో టాలీవుడ్

కిరణ్ కుమార్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక టాలెంటెడ్ డైరెక్టర్‌ను కోల్పోవడం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. తన సినిమా వెండితెరపై ఎలా ఉంటుందో చూడకుండానే ఆయన వెళ్లిపోవడం 'KJQ' చిత్ర బృందాన్ని కలచివేస్తోంది.  చాలా కాలం విరామం తర్వాత కిరణ్ కుమార్ 'KJQ: కింగ్.. జాకీ.. క్వీన్' అనే చిత్రంతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేశారు. 
 

అయితే షూటింగ్ చివరి దశలో ఉండగా కిరణ్ కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనివల్ల చిత్రీకరణ సుదీర్ఘ కాలం నిలిచిపోయింది. ఆరోగ్యం కాస్త కుదుటపడగానే, పట్టుదలతో ఇటీవల మళ్ళీ షూటింగ్ ప్రారంభించి పూర్తి చేశారు . ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించాలనుకుంటున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

'కేడి'తో గుర్తింపు.. 

కిరణ్ కుమార్ 2010లో టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన 'కేడి' సినిమాతో మెగాఫోన్ పట్టారు. ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన విజయం సాధించకపోయినా, నాగార్జునను ఒక కొత్త స్టైలిష్ లుక్‌లో చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నా లాంటి కొత్తవాడికి నాగార్జున గారు అవకాశం ఇవ్వడం వల్లే నేను ఇండస్ట్రీకి రాగలిగాను అని కిరణ్ కుమార్ తరచూ చెబుతుండేవారు. ఆయన మేకింగ్‌లో ఒక ప్రత్యేకమైన విజన్ ఉండేదని ఇండస్ట్రీ ప్రముఖులు కొనియాడారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం విడుదలకు ముందు కిరణ్ మృతి చెందడం సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలిచివేసింది.