వెన్న, జున్ను తింటే గుండెకు ప్రమాదమా... కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే ?

వెన్న, జున్ను తింటే గుండెకు ప్రమాదమా... కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే ?

కొన్ని ఏళ్లుగా  మనం వింటున్న మాట ఏంటంటే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వెన్న, నెయ్యి, జున్ను వంటి కొవ్వు(saturated fats) ఉన్న పదార్థాలు తీసుకోవడం మానేయాలి అని... కానీ ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ ఈ పాత నమ్మకం  కూడా మారుతోంది. ఎందుకంటే కొవ్వులన్నీ(saturated fats) గుండెకు హాని చేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 సుమారు 60వేల  మందిపై చేసిన ఒక  అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు వెన్న లేదా జున్ను తినడం తగ్గించిన  కూడా  గుండె జబ్బుల ముప్పు తగ్గలేదని తేలింది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఇది కొంతవరకు ఉపయోగపడవచ్చు కానీ, అందరికీ ఇది వర్తించదు. కానీ అన్ని రకాల కొవ్వులు శరీరంలో ఒకేలా పనిచేయవు. 

జున్నులో కొవ్వు ఉన్నప్పటికీ.. కాల్షియం, ప్రోటీన్  వల్ల  శరీరంలోని 'చెడు' కొలెస్ట్రాల్‌ను (LDL) అధికంగాపెంచదు. కొన్ని అధ్యయనాల్లో జున్ను తినడం వల్ల గుండెకు ఎలాంటి నష్టం కలగలేదని తేలింది. అలాగే జున్నుతో పోలిస్తే వెన్న ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కాస్త ఎక్కువ.

Also Read :  మాయదారి జలుబు.. దగ్గుకు దూరంగా ఉండండి.. ఈ జాగత్తలతో సర్ధి..రొంప మీ జోలికి రావు..!

 చాలామంది వెన్న, జున్ను మానేసి వాటి ప్లేస్‌లో వైట్ బ్రెడ్, షుగర్ ఉన్న స్నాక్స్ తింటారు. దీనివల్ల గుండెకు లాభం కంటే నష్టమే ఎక్కువ. పాలు, జున్ను, పెరుగులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్-ఎ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని పూర్తిగా మానేస్తే శరీరం ఈ పోషకాలను కోల్పోతుంది.

అలాగే కేవలం ఒక్క పదార్థం వల్లే గుండె జబ్బులు రావు. మీరు రోజంతా ఏం తింటున్నారు, ఎంత వ్యాయామం చేస్తున్నారు అనేదే ముఖ్యం.

అంతేకాకుండా  ఏదైనాసరే పూర్తిగా నిషేధించాల్సిన పనిలేదు. వెన్న, జున్ను వంటివి తక్కువగా తింటే ప్రమాదం లేదు. మీ ప్లేట్‌లో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, నట్స్ కూడా ఉండేలా చూసుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే  బయట దొరికే జంక్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్, అతిగా చక్కెర ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి.

 మీ వయస్సు, కుటుంబ చరిత్ర, కొలెస్ట్రాల్ స్థాయిలను బట్టి మీ డైట్ ప్లాన్ ఉండాలి. ఏదైనా పెద్ద మార్పు చేసే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.