లెక్చరర్లకు బయోమెట్రికా?

లెక్చరర్లకు బయోమెట్రికా?

పాలిటెక్నిక్‌‌ కాలేజీల్లో బయోమెట్రిక్‌‌ అటెండెన్స్‌‌ విధానం చిలికిచిలికి గాలివానలా మారుతోంది.  స్టూడెంట్స్‌‌కు బయోమెట్రిక్‌‌ హాజరులేదని పరీక్షలకు దూరం చేసి, దారిలోకి తెచ్చిన సాంకేతిక విద్యామండలి, అదే తీరులో యాజమాన్యాలనూ గాడిలో పెట్టే పనిలో పడింది. బయోమెట్రిక్ వాడని లెక్చరర్ల వేతనం కట్‌‌ చేసి, టెక్నికల్‌‌ బోర్డు ఖాతాలో వేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలు మేనేజ్మెంట్లు,  ఆ శాఖ కమిషనర్ మధ్య చిచ్చుపెట్టాయి. దీనికి తోడు మరో రెండు కొత్త నిబంధనలు మేనేజ్ మెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

77 కాలేజీలకు నోటీసులు

రాష్ర్టంలో 116 ప్రైవేటు పాలిటెక్నిక్‌‌ కాలేజీలు ఉన్నాయి. గత సెమిస్టర్‌‌ నుంచి అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్‌‌ అటెండెన్స్‌‌ను సాంకేతిక విద్యాశాఖ ప్రవేశపెట్టింది.75 శాతం అటెండెన్స్‌‌ లేని సుమారు 21,300 మంది విద్యార్థులను సెమిస్టర్‌‌ పరీక్షలకు అనుమతించలేదు. దీనిపై పెద్ద గొడవ జరిగితే వారికి వేసవిలో స్పెషల్‌‌ క్లాసులు పెట్టి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ లొల్లి అంతటితో ఆగలేదు. లెక్చరర్ల మీదికి మళ్లింది. బయోమెట్రిక్‌‌ ఉపయోగించని లెక్చరర్లపైనా చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే ప్రకటించినా మేనేజ్మెంట్లు పెద్దగా పట్టించుకోలేదు. పాలిసెట్‌‌ తేదీ ప్రకటించిన తర్వాత దీనిపై యాజమాన్యాలకు అధికారులు నోటీసులిచ్చారు. బయోమెట్రిక్‌‌ ఉపయోగించని లెక్చరర్ల  వేతనాలు  కట్‌‌ చేసి టెక్నికల్‌‌ బోర్డు ఖాతాలో వేయాలని, లేకపోతే 2019–-20 విద్యాసంవత్సరానికి కాలేజీకి అనుమతివ్వబోమని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ శివారులోని ఓ పాలిటెక్నిక్‌‌ కాలేజీకి ఏకంగా రూ.60,22,800 రికవరీ చేయాలని నోటీసులిచ్చారు. రాష్ట్రంలోని 77 కాలేజీలకు ఇదే తరహాలో లక్షల్లో రికవరీ చేయాలని నోటీసులు జారీచేయడంతో మేనేజ్మెంట్లలో కలవరం మొదలైంది. వచ్చే సెమిస్టర్‌‌ నుంచి అమలు చేస్తామని యాజమాన్యాలు చెప్తున్నాయి. అయితే వారి నుంచి రాతపూర్వకంగా లేఖ తీసుకుని, ఈసారికి వదిలేయాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.

నిబంధనలతో ఇబ్బందే..
ప్రైవేటు పాలిటెక్నిక్‌‌ కాలేజీల్లో చేరిన ఒక్కో విద్యార్థి ఏటా రూ.500 చొప్పున అఫిలియేషన్ ఫీజును సాంకేతిక విద్యాశాఖకు చెల్లించాలి. అయితే ఈ ఏడాది కొత్తగా చేరే విద్యార్థి మూడేండ్ల ఫీజును ఒకేసారి కట్టాలని నిబంధన పెట్టారు. ఇది మేనేజ్మెంట్లకు ఇబ్బందిగా మారింది. విద్యార్థులు మధ్యలో మానేసినా, వేరే చోటికి ట్రాన్స్‌‌ఫర్‌‌ అయినా తాము నష్టపోతామని యాజమాన్యాలు చెప్తున్నాయి. ఈ నిబంధన తొలగించాలని డిమాండ్‌‌ చేస్తున్నాయి. టెంపరరీ బిల్డింగ్‌‌ విషయంలోనూ కొత్త నిబంధనలను మేనేజ్మెంట్లు వ్యతిరేకిస్తున్నాయి.

 మీటింగ్‌‌ లొల్లిలొల్లి
పాలిటెక్నిక్‌‌ కాలేజీల్లో నోటీసులు, కొత్త నిబంధనల నేపథ్యంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌‌ నవీన్‌‌ మిట్టల్‌‌, ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లతో నాలుగు రోజుల క్రితం సమావేశమయ్యారు. నిబంధనలను సవరించాలని మేనేజ్మెంట్లు మెమోరాండం అందించాయి. దీంతో నవీన్ మిట్టల్ సీరియస్‌‌ అయి, దాన్ని చింపేసినట్టు తెలిసింది. దీనిపై మేనేజ్మెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ సమస్యలు తీర్చకున్నా, కనీసం పక్కన పెట్టకోవాలని, చింపెయ్యడం ఏంటని నిలదీసినట్టు సమాచారం. దీంతో నవీన్‌‌ మిట్టల్‌‌ వారిని శాంతింపజేసినట్టు తెలిసింది. కాలేజీల విజ్ఞప్తి మేరకు బయోమెట్రిక్‌‌ విధానం అమలు చేయడంపై మేనేజ్మెంట్ల నుంచి అండర్‌‌ టేకింగ్‌‌ తీసుకుంటున్నామని టెక్నికల్‌‌ బోర్డు ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. మేనేజ్మెంట్లకు ఎన్నోసార్లు చెప్పినా వినకపోవడంతోనే నోటీసులు ఇచ్చామన్నారు. మీటింగ్‌‌లో గొడవేమీ జరగలేదని చెప్పుకొచ్చారు. ఓ తీర్మానానికి వచ్చి దాన్ని అమలు చేసేందుకు అంగీకరించినట్టు తెలిపారు.

 

ఇబ్బంది పెట్టడం సరికాదు
నిబంధనల పేరుతో ప్రైవేటు కాలేజీలమేనేజ్మెంట్లను ఇబ్బందులకు గురిచేయడంభావ్యం కాదు. ఫస్టియర్‌ లో చేరిన విద్యార్ థిఅఫ్లియేషన్‌ ఫీజు మూడేండ్లది ఒకేసారిచెల్లించాలనడం సరికాదు. ఏడాది నుం చిఫీజు రీయింబర్స్‌ మెంట్‌ , స్కాలర్‌ షిప్స్‌రాలేదు. డబ్బులు చెల్లిస్తేనే కౌన్సెలింగ్‌ లోకాలేజీ పేరు పెడతామని ఒత్తిడి చేయడంసరికాదు. ఇచ్చిన జీతాలను లెక్చరర్ల నుం చిఎలా రికవరీ చేస్తాం ? ప్రైవేటు విద్యావిధానంవద్దని ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తేకాలేజీలు మూసేయడానికి రెడీగా ఉన్నాం
– గౌతంరావు,  ప్రైవేటు మేనేజ్మెంట్స్‌‌ అసోసియేషన్‌‌ ప్రతినిధి