
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ సారి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' సిద్ధం అవుతోంది. 'డబుల్ హౌస్, డబుల్ డోస్' ఫార్మాట్‌తో రాబోతోతున్న ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' సెప్టెంబర్ 7, 2025న ప్రారంభం కానుంది.
అయితే ఈ సారి బిగ్ బాస్ షోలో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు నిర్వాహకులు. తొలిసారి40 మంది సామాన్యులను ఎంపిక చేశారు. ఈ సామాన్య కంటెస్టెంట్లను ఎంపిక చేయడానికి బిగ్ బాస్ నిర్వాహకులు 'బిగ్ బాస్ తెలుగు 9: అగ్నిపరీక్ష' అనే ఒక ప్రత్యేక ప్రీ-సీజన్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. వీరు ప్రత్యేక టాస్క్ లలో పాల్గొంటారు. ఇది షోకి మరింత థ్రిల్లింగ్ ను తీసుకురానుంది.
దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైనట్లు సమాచారం. వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల నుండి చివరికి 40 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ 40 మంది ఇప్పుడు అనేక కఠినమైన పరీక్షలను ఎదుర్కొని, తమ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియ తర్వాత, అగ్రశ్రేణిలో నిలిచిన ముగ్గురు సామాన్యులకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అద్భుతమైన అవకాశం లభిస్తుంది.
►ALSO READ | ParamSundari: ‘పరమ్ సుందరి’ ట్రైలర్ రిలీజ్.. సిద్ధార్థ్, జాన్వీల రొమాంటిక్ ఎంటర్టైనర్
సామాన్యులకు నిర్వహించే అగ్నిపరీక్షకు జడ్జ్‌లుగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు అభిజిత్, నవదీప్, బిందు మాధవి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఈ ముగ్గురు కలిసి 40 మంది సామాన్యులలో ముగ్గురిని ఎంపిక చేయనున్నారు. ఈ ఆగ్నిపరీక్ష షో.. ఆగస్టు 22 వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ అగ్నిపరీక్షకు సంబంధించిన ప్రోమో త్వరలో విడుదల చేయనున్నారు. 'ఈసారి ఆట కాదు, రణరంగమే' అనే క్యాప్ లైన్‌తో ఈ సీజన్ మరింత ఉత్కంఠగా సాగే అవకాశం ఉంది
అధికారిక కంటెస్టెంట్లలో సెలబ్రిటీల జాబితా ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే, టీవీ, సినిమా రంగాల నుండి ప్రముఖులు, అలాగే సోషల్ మీడియా సెలబ్రిటీలు ఈ సీజన్‌లో పాల్గొనే అవకాశం ఉంది . సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈసారి సామాన్య కంటెస్టెంట్లు కూడా జోడించబడటం వల్ల షో మరింత సరదాగా, కొత్త నాటకాలతో అలరించబోతుంది. మొత్తం మీద ఈ సీజన్ అంచనాలకు మించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.