అత్యాచారం కేసులో కోర్టు తీర్పు..టాయ్ లెట్ కు అని వెళ్లి నిందితుడు పరార్

అత్యాచారం కేసులో కోర్టు తీర్పు..టాయ్ లెట్ కు అని వెళ్లి నిందితుడు పరార్

నల్లొండ జిల్లాలో అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నిందితుడు పోలీసుల కళ్లు కప్పి పరారయ్యాడు. కోర్టుకు వచ్చిన నిందితుడు టాయ్ లెట్ కని చెప్పి  అక్కడి నుంచి అటే  పారిపోయాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. నల్లగొండ వన్ టౌన్ పరిధిలోని లైన్ వాడకు చెందిన గ్యారాల శివకుమార్ బిటిఎస్ కి చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  యాదమ్మ బిడ్డ  మైనర్ బాలికపై కన్నేసిన నిందితుడు బాలిక తల్లి అయిన యాదమ్మ సహకారంతో  మైనర్ ను బలవంతంగా పెళ్లి చేసుకొని అత్యాచారం చేశాడు.  అప్పటికే  శివకుమార్ కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

►ALSO READ | పోటెత్తిన వరద..నాగార్జున సాగర్ 18 గేట్లు ఓపెన్

ఈ ఘటనపై మే 8, 2023న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గ్యారాల శివకుమార్ పై  కేసు నమోదు అయ్యింది. 366-A,343,376,420,506,109 IPC,3r/w 4 POCSO AC5 2012 Act కింద నల్లగొండ వన్ టౌన్ పోలీస్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆగస్టు 12న కోర్టు తీర్పు వెల్లడించనుండగా కోర్టు ఆవరణకు వచ్చిన నిందితుడు  వాష్ రూమ్ కని చెప్పి పరారయ్యాడు. దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.