కాలేజీ, వర్సిటీల్లో బయోమెట్రిక్​ అటెండెన్స్

కాలేజీ, వర్సిటీల్లో బయోమెట్రిక్​ అటెండెన్స్
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో స్టూడెంట్లు, స్టాఫ్​కు బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలంటూ విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ–పాస్ స్కాలర్​పిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్​కు ఈ అటెండెన్స్ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్ అటెండెన్స్​తో పాటు లీవ్స్​ కూడా దీనిద్వారానే అప్లై చేసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీలతో పాటు అన్ని ప్రొఫెషనల్ కాలేజీల్లోనూ ఇది అమల్లోకి వస్తుందన్నారు.
 
నిర్వహణపై లేని క్లారిటీ
బయోమెట్రిక్​ అటెండెన్స్​ ఈనెల1 నుంచి అమలు చేయాల్సి ఉన్నప్పటికీ.. 2వారాలు ఆలస్యంగా ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆలోచన మంచిదే కానీ, దాని ఏర్పాటు, నిర్వహణపై క్లారిటీ లేదు. ఇప్పటికీ చాలా కాలేజీల్లో బయోమెట్రిక్ పరికరాల్లేవు. ఉన్న చోట సరిగా పనిచేయడం లేదు. ఇలాంటి టైంలో స్పష్టత ఇవ్వకుండా, ఉత్తర్వులు జారీ చేయడంపై అయోమయం నెలకొన్నది. ఇంటర్ కాలేజీల్లో గతంలో బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండేది. కరోనా తర్వాత దాన్ని పక్కనపెట్టేశారు. మిగిలిన కాలేజీల్లోనూ ఇదే దుస్థితి. కొత్తగా ఇన్​స్టాల్​ చేసేచోట డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధులివ్వకుండా, ఇవన్నీ ఎలా చేయాలో కూడా చెప్పాలని కోరుతున్నారు.