జేఎన్టీయూ –హెచ్ అనుబంధ కాలేజీల్లో బయోమెట్రిక్ మస్ట్

జేఎన్టీయూ –హెచ్  అనుబంధ కాలేజీల్లో బయోమెట్రిక్ మస్ట్

తమ అనుబంధ కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని జేఎన్టీయూ హైదరాబాద్ ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ అమలు చేయలేని కాలేజీలు  ఈ నెల 30లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఇక జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా బయోమెట్రిక్ అమలు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు. అధికారులు బయోమెట్రిక్ మానిటరింగ్ చేయడంలో విఫలమయ్యారని చెబుతున్నారు.

అటెండెన్స్ రిపోర్ట్ లో స్పష్టంగా హాజరుకావడం లేదని తెలిసినప్పటికీ ఆయా కళాశాలలకు గతంలో అనుమతులిచ్చి.. ఇప్పుడు ఇలాంటి ఆదేశాలివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో సిలికాన్ తంబ్ లను కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు. దీనిపై జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు దృష్టిసారించి బయోమెట్రిక్ విధానం కంటే ఐరిస్ లేదా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని  కోరుతున్నారు.