యాదగిరిగుట్ట టెంపుల్ లో బయోమెట్రిక్ అటెండెన్స్

యాదగిరిగుట్ట టెంపుల్ లో బయోమెట్రిక్ అటెండెన్స్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈఎస్ఎస్ఎల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టంను శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. ఈ విధానం ద్వారా ఆలయ సిబ్బంది హాజరు రియల్ టైంలో నమోదై పారదర్శకత పెరుగుతుందన్నారు. 

బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టంలో సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియను శనివారం అయన స్వయంగా పరిశీలించారు. సిబ్బంది పేర్లు, హోదాలు, విభాగాలు, మొబైల్ నంబర్లు వంటి వివరాలు సరిగ్గా నమోదు అవుతున్నాయా అని సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం ద్వారా హాజరు పర్యవేక్షణ ఈజీ అవ్వడమే కాకుండా నిర్వహణ వేగంగా జరుగుతుందన్నారు.