
ఇందుకోసం రబ్బర్ థంబ్స్ వాడకం
బయోమెట్రిక్ కోసమే కొందరి నియామకం
పొద్దున, సాయంత్రం వచ్చి అటెండె న్స్ ఇస్తే చాలు
ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల్లో అక్రమాలు
నిరుద్యోగులు, క్వాలిటీ ఎడ్యుకేషన్‌పై దెబ్బ
ఓ వైపు యూనివర్సిటీలు రూల్స్ కఠినం చేస్తుంటే.. మరోవైపు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు కొత్తదారులు వెతుకుతున్నాయి. ప్రొఫెషనల్ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయడంతో, దానికి అనుగుణంగానే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని కాలేజీల్లో ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ అటెండెన్స్ వేసి వెళ్లే వెసులుబాటు ఉండగా, అసలు కాలేజీకే రాకున్నా అటెండెన్స్ పడేలా మరికొన్ని కాలేజీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అధికారుల తనిఖీల సమయంలో మాత్రం ఫ్యాకల్టీ అందరూ ఉండేలా చూసుకుంటున్నాయి. ఇలాంటి చర్యల వల్ల నిరుద్యోగులకు ఉపాధి లేకుండా పోతోందని, ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ కూడా తగ్గుందని వాదనలు వినిపిస్తున్నాయి.
వెయ్యికి పైగా కాలేజీలు..
రాష్ర్టంలో జేఎన్‌టీయూ, ఓయూ, కేయూతోపాటు పలు వర్సిటీల పరిధిలో వెయ్యి వరకూ ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీలున్నాయి. వీటిలో అత్యధికంగా 293 ఎంబీఏ కాలేజీలు, 193 ఇంజనీరింగ్ , 118 బీఫార్మసీ, 211 బీఈడీ, 109 ఎంఫార్మసీ కాలేజీలుండగా, మిగిలినవి ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్ తదితర కాలేజీలున్నాయి. రూల్స్ ప్రకారం ఒక్కో టెక్నికల్ కాలేజీలో డిపార్ట్‌మెంట్‌కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి. ఈ లెక్కన ఒక కాలేజీలో కనీసం 50 మందికి తగ్గకుండా టీచింగ్ సిబ్బంది ఉంటారు. కానీ ఒక్క కాలేజీలోనూ రూల్స్ ప్రకారం సిబ్బంది ఉండరని అధికారులే చెప్తున్నారు. ఇటీవల జేఎన్టీయూ, ఓయూ అధికారులు బయోమెట్రిక్ తప్పనిసరి చేయడం, తనిఖీలు పెంచడంతో కాలేజీలు తప్పనిసరిగా సిబ్బందిని నియమించుకోవాల్సి వచ్చింది.
ఫ్యాకల్టీ రాకున్నా రబ్బర్ తొడుగులతో అటెండెన్స్ వేస్తున్న ఘటనలు పలుమార్లు బయటికొచ్చాయి. రబ్బర్ థంబ్స్, డమ్మీ థంబ్స్ తయారీదారులను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు, వారు పలు కాలేజీల పేర్లు చెప్పారు. అయినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ చాలా కాలేజీల్లో అటెండెన్స్ ఇలానే కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు మాత్రం ఫ్యాకల్టీ సంఖ్య సరిగ్గా ఉండేలా కాలేజీలు జాగ్రత్త పడుతున్నాయి. ఇందుకోసం యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, మేనేజ్మెంట్లు అధికారులను మేనేజ్ చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సగం మంది ఫ్యాకల్టీ వారంలో రెండు, మూడు రోజులు ఏదో ఒక సమయంలో వచ్చి బయోమెట్రిక్ వేసినా పర్లేదనే ధోరణిలో కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఉన్నాయి. చాలా కాలేజీల్లో ఉదయం, సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ వేసిపోయే వారే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. వారికి వేతనాలూ రూ.12 వేల వరకు ఇస్తున్నారు. హైదరాబాద్శివార్లలోని హయత్‌నగర్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో 60 మంది ఫ్యాకల్టీ ఉండగా, వారిలో మే నెలలో 20 మంది ఒక్క రోజు కూడా రాలేదు. అయినా ఆ కాలేజీపై ఎలాంటి చర్య తీసుకోలేదని సమాచారం. ఇలాంటి కాలేజీలు రాష్ర్టంలో కోకొల్లలు.
చర్యలు తీసుకోవాలి
రూల్స్‌కు విరుద్ధంగా ఫ్యాకల్టీ లేకుండా కాలేజీలను నిర్వహిస్తు న్న మేనేజ్ మెంట్లపై చర్యలు తీసుకోవాలి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు దొరుకుతాయని భావించినం. కానీ సర్కారు ఉద్యోగాలే కాదు, ప్రైవేటు కొలువులు కూడా కష్టం గా మారాయి . ఫ్యాకల్టీ లేకున్నా, ఉన్నట్ టు మేనేజ్ మెంట్లు కాగితాలపై చూపిస్తున్ నాయి. దీంతో ఎంతో మందికి ఉపాధి పోతోంది. ‑ సంతోష్‌కుమార్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్