MaaVande: వచ్చేస్తున్న పీఎం మోడీ బయోపిక్.. ‘మా వందే’ను తెరకెక్కిస్తున్న తెలుగు డైరెక్టర్

MaaVande: వచ్చేస్తున్న పీఎం మోడీ బయోపిక్.. ‘మా వందే’ను తెరకెక్కిస్తున్న తెలుగు డైరెక్టర్

పీఎం నరేంద్ర మోడీ ఇవాళ (సెప్టెంబర్ 17న) 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మోడీ బయోపిక్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నరేంద్ర మోడీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని  ఈ భారీ బహుభాషా చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు ‘మా వందే’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి పీఎం మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో 'ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్ప బలం గొప్పది' అని మేకర్స్ రాసుకొచ్చారు. ఈ బయోపిక్లో.. మదర్ సెంటిమెంట్ బ్యాక్డ్రాప్తో పాటుగా మోడీ రాజకీయ ప్రస్థానాన్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. 

ఇందులో మలయాళ హీరో ఉన్ని ముకుందన్, ప్రధాని మోడీ పాత్రను పోషించబోతున్నారు. హీరో ఉన్ని ముకుందన్, తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘యశోద’, మార్క్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమాను క్రాంతి కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్‌లు మరియు నటించే మిగతా నటీనటులు ఎవరనేది త్వరలో వెల్లడి చేయనున్నారు మేకర్స్. 

►ALSO READ | HappyBirthdayModi: ప్రధాని మోడీ బర్త్ డే స్పెషల్.. వీడియోలు రిలీజ్ చేసి విష్ చేసిన టాలీవుడ్ స్టార్స్

ఇకపోతే, ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ఇండియా టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. బాహుబలి, ఈగ చిత్రాలకు పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ నిర్వహిస్తున్నారు. అలాగే, RRRఫేమ్' సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. 'కేజీఎఫ్', 'సలార్' వంటి హిట్ సినిమాలకు మ్యూజిక్ చేసిన రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. కింగ్ సోలమన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ‘మా వందే’ బయోపిక్.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, గుజరాతీ, మరాఠీ, మలయాళంతో పాటుగా ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ కానుంది.

అయితే, ఇప్పటికే.. 2019లో ‘PM Narendra Modi’ అనే బయోపిక్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోడీ పాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేదు.