
గచ్చిబౌలి, వెలుగు: కొండాపూర్ బోటానికల్గార్డెన్లో ఆదివారం బర్డ్ వాక్ (పక్షుల వీక్షణ) నిర్వహించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి 18 మంది పక్షి ప్రేమికులు పాల్గొన్నారు. దాదాపు 26 రకాల పక్షులను గుర్తించారు.
ప్రాజెక్ట్స్ మేనేజర్ (ఎకో టూరిజం) కె. సుమన్, నేచురలిస్ట్ అపరంజని గార్డెన్‌లోని వివిధ పక్షి జాతుల గురించి వివరించారు. ఈ నెల 25న ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో మరో బర్డ్ వాక్ కార్యక్రమం ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు 9493549399, 9346364583 నంబర్లను సంప్రదించాలని కోరారు.