
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ శివారు బొమ్మకల్‌లోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు 11,12వ తరగతి నిర్వహణ కోసం సీబీఎస్ఈ ద్వారా సెకండరీ స్కూల్ హోదా లభించినట్లు చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో ప్రశాంత్‌రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ పట్ల తల్లిదండ్రులు చూపిస్తున్న విశ్వాసానికి ఇది మరో నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భబిత విశ్వనాథన్, టీచర్లు, పేరెంట్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.