బిర్సాముండా ఆదివాసీ స్వేచ్ఛా హక్కుల సింహగర్జన : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

బిర్సాముండా ఆదివాసీ స్వేచ్ఛా హక్కుల సింహగర్జన : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  •     మంత్రి అడ్లూరి లక్ష్మణ్​

భద్రాచలం, వెలుగు :  బిర్సా ముండా ఆదివాసీ స్వేచ్ఛా హక్కుల సింహగర్జన అని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ, మైనార్జీ సంక్షేమం, వికలాంగులు, సీనియర్​ పౌరులు, లింగమార్పిడి సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ అన్నారు. బిర్సా ముండా150వ జయంతి, రాష్ట్ర స్థాయి జెన్​ జాతీయ గౌరవ దివస్​ వేడుకల్లో ఆయన శనివారం పాల్గొని మాట్లాడారు. 

ఆయనకు గిరిజన సంస్కృతి, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. బిర్సాముండా ఫొటోలకు పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి శ్రద్ధాంజలి ఘటించి, తెలంగాణ గీతం ఆలపించాక ఆయన మాట్లాడారు. చిన్నతనంలోనే ఆంగ్లేయులతో పోరాడిన మహోన్నత వ్యక్తి బిర్సా ముండా అని తెలిపారు. 

భూమి హక్కులు, సంస్కృతి, స్వేచ్ఛ, గిరిజన గౌరవాన్ని కాపాడేందుకు పవిత్ర విప్లవాన్ని ఆయన కొనసాగించారని గుర్తుచేశారు. బిర్సా ముండా పేరు నేడు భారతదేశానికే కాదు ప్రపంచ ఉద్యమాలకు ధైర్యం ఇచ్చే చిహ్నంగా మారిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం జన జాతీయ గౌరవ దివస్​గా ప్రకటించడం ఆయన పోరాట చరిత్రకు ఇచ్చిన అత్యున్నత గౌరవం అన్నారు.

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్ఫూర్తితోనే భూమి హక్కులు, విద్య, ఉపాధి, గిరిజనులకు ప్రత్యేక రక్షణకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 6.7లక్షల ఎకరాలకు పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నామని, గిరిజన సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబింబించేలా జోడేఘాట్, మేడారం, భద్రాచలం లాంటి కేంద్రాల్లో గిరిజన మ్యూజియాలు అభివృద్ధి చేసి కళలకు, భాషకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అనంతరం నీట్, జేఈఈలో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన విద్యార్థులకు ల్యాప్​ట్యాప్​లను మంత్రి పంపిణీ చేశారు. 

మంత్రితో పాటు మహబూబ్​బాద్​ ఎంపీ పోరిక బలరాంనాయక్​, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, ట్రైబల్​ వెల్ఫేర్​ అడిషనల్ డైరక్టర్​ సర్వేశ్వర్​రెడ్డి, టీసీఆర్​టీఐ డైరక్టర్​ సమజ్వాల, జీఎం శంకర్​రావు, కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్, ఎస్పీ రోహిత్​రాజ్, ఐటీడీఏ పీవో బి.రాహుల్, ట్రైనీ కలెక్టర్​ సౌరభ్ శర్మ, ఏఎస్పీ విక్రాంత్​కుమార్​ సింగ్​ ఉన్నారు. తర్వాత ఐటీడీఏ మీటింగ్ హాలులో నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో గిరిజన సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమస్యల పరిష్కారం చేపడుతున్న  చర్యలను కలెక్టర్, పీవోలు వివరించారు. 

ఆదివాసీ హక్కుల సాధనలో అగ్రగామి

ఖమ్మం టౌన్ :  బిర్సా ముండా ఆదివాసీ హక్కుల సాధనలో అగ్రగామిగా నిలిచారని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.  ఖమ్మం గొల్లగూడెం ఏజీహెచ్‌‌ఎస్ లో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయలక్ష్మి, ఖమ్మం, వైరా ఏటీడీఓలు, ఏసీఎంఓ, ఎస్సీఆర్సీ, హెడ్మాస్టర్ ఉన్నారు.