జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ.. ఇక మరింత సులభం.. 300 వార్డులు, 60 సర్కిళ్లకు మ్యాపింగ్ పూర్తి

జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ.. ఇక మరింత సులభం.. 300 వార్డులు, 60 సర్కిళ్లకు మ్యాపింగ్ పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో 27 అర్బన్ లోకల్ బాడీల విలీనంతో పాటు వార్డుల సంఖ్యను 150 నుంచి 300కి, సర్కిళ్లను 30 నుంచి 60కి, జోన్లను 6 నుంచి 12కి పెంచిన నేపథ్యంలో జనన – మరణాల నమోదు, జారీ వ్యవస్థను మరింత పటిష్టంగా తీర్చిదిద్దారు.

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలతో పాటు 60 సర్కిళ్లు, 300 వార్డుల మ్యాపింగ్​ను పూర్తి చేసి, గ్రేటర్ పరిధిలో జనన , మరణ సాఫ్ట్​వేర్ అప్లికేషన్​ను విజయవంతంగా ప్రారంభించారు. 

ఈ సరికొత్త వ్యవస్థతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నమోదు, జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారనుంది. పౌరులు అందరూ తమ సమీప మీసేవా కేంద్రాల ద్వారా సులభంగా జనన, మరణ పత్రాల సేవలను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.