బిర్యానీ విందు, సౌదీ మతాధికారులతో.. బాబ్రీ తరహా మసీదుకు శంకుస్థాపన..ముర్షిదాబాద్ లో ఉద్రిక్తత

బిర్యానీ విందు, సౌదీ మతాధికారులతో.. బాబ్రీ తరహా మసీదుకు శంకుస్థాపన..ముర్షిదాబాద్ లో ఉద్రిక్తత

బెంగాల్ లో శనివారం (డిసెంబర్6) ఉద్రిక్తత నెలకొంది. సస్పెండ్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ముర్షీదాబాద్ లో బాబ్రీ మసీదు తరహా మసీదుకు శంకుస్థాపన చేశాడు. బాబ్రీమసీదు కూల్చివేత రోజున  ఈ కార్యక్రమం చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

శనివారం మద్యాహ్నం బెల్దాంగలో ఖురాన్ పఠనం అనంతరం పునాది రాయి వేసి శంకుస్థాపన చేశారు.  సౌదీ అరేబియా నుంచి వచ్చిన మతాధికారులు, సహా వేలాది వచ్చారు. అల్లాహు అక్బర్, నారా ఎ తక్బీర్  అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే  కబీర్ మద్దతుదారులు తలపై ఇటుకలు తీసుకొని వెళ్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు , కేంద్ర దళాలు గస్తీ  తిరిగారు. 

ఈ కార్యక్రమానికి మూడు వేల మంది వాలంటీర్లు, 40వేల మంది అతిథులు, 20 వేల స్థానికులకు  విందు ఇచ్చినట్లు తెలుస్తోంది. షాహీ బిర్యానిని ఏర్పాటు చేసేందుకు ఏడు క్యాటరింగ్ ఏజెన్సీలో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆహార ఖర్చులు  రూ.30 లక్షలు.. మొత్తం బడ్జెట్ రూ.70 లక్షలకు పైగా వచ్చిందని  కబీర్ చెప్పడం ఏం రేంజ్ కార్యక్రమం నిర్వహించారో తెలుస్తోంది. 

వివాదాస్పద మసీదు నిర్మాణ ప్రాజెక్ట్ కారణంగా ఈ వారం ప్రారంభంలో టీఎంసీ నుంచి కబీర్ ను సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష బీజేపీనుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయం కలకత్తా హైకోర్టుకు కూడా వెళ్లింది. మమతా బెనర్జీ ప్రభుత్వం శాంతిభద్రతల దృష్ట్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ మసీదు నిర్మాణంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. 

►ALSO READ | అయోధ్య రామమందిరం పూర్తి చేశాం..మిగిలింది కాశీ, మధుర ఆలయాలే : సీఎం యోగి

అధిక ముస్లిం జనాభా ఉన్న ముర్షిదాబాద్ ఓ నిర్మానుష్య ప్రాంతం. కొన్ని నెలల క్రితం ఏప్రిల్‌లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో  ఐదుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు.

భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం.. బీజేపీ 

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ  భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది... ఎమ్మెల్యే కబీర్ ను ఉపయోగించుకుంటోందని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మసీదు నిర్మాణ మతపరమైనది కాదు.. మమత ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇలా చేస్తోందని విమర్శించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోందని కబీర్ ను ప్రీలాన్సర్ గా ఉపయోగిస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే బీజేపీ ఆరోపణలు నిరాధారణమైనవి  టీఎంసీ తోసిపుచ్చింది. కబీర్ కాషాయ పార్టీ జీతం తీసుకుంటున్నారని హింసను రెచ్చగొట్టేందుకు  ఏజెంట్ పనిచేస్తున్నారని ఆరోపించింది. ముర్షిదాబాద్ ప్రజలు శాంతని ప్రేమించేవారు.. రెచ్చగొట్టే చర్యలకు మద్దతు ఇవ్వరు అంటూ టీఎంసీ నేతలు బీజేపీకి కౌంటర్ ఇచ్చారు.