కరోనా దెబ్బకు బిర్యానీ ఆర్డర్లు డల్

కరోనా దెబ్బకు బిర్యానీ ఆర్డర్లు డల్

బిర్యానీ ఆర్డర్లు  పడిపోయినయ్: రెస్టారెంట్లు

హోటళ్లు, షాపింగ్‌‌‌‌ మాల్స్‌‌‌‌కు జనం తగ్గిన్రు
కేంద్ర టీమ్ ఆరా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌‌‌‌ మాల్స్‌‌‌‌పై కరోనా ఎఫెక్ట్‌‌‌‌ పడింది. హైదరాబాద్​లో నిత్యం రద్దీగా ఉండే షాపింగ్‌‌‌‌ మాల్స్‌‌‌‌లో బుధవారం జనం పలచగా కనిపించారు. ముషీరాబాద్‌‌‌‌, కాచిగూడ, బంజారాహిల్స్‌‌‌‌, అమీర్‌‌‌‌పేట్‌‌‌‌లోని మాల్స్‌‌‌‌ ఖాళీగా కనిపించాయి. ఆర్టీసీ క్రాస్‌‌‌‌ రోడ్స్‌‌‌‌లోని సినిమా థియేటర్లు, హోటళ్లలోనూ ఇదే పరిస్థితి.

ఇప్పుడు బిర్యానీ కూడా..

రాష్ట్రవ్యాప్తంగా చికెన్‌‌‌‌ అమ్మకాలు తగ్గినా.. హైదరాబాద్‌‌‌‌లో కరోనా వైరస్ డిటెక్ట్‌‌‌‌ అయ్యే వరకు చికెన్‌‌‌‌ బిర్యానీ అమ్మకాలు జోరుగానే సాగాయి. రెండు రోజులుగా బిజినెస్‌‌‌‌ 50 శాతం తగ్గిందని హోటల్‌‌‌‌ నిర్వాహకులు చెప్తున్నారు. ఫుడ్‌‌‌‌ ఆర్డర్లపైనా ఈ ఎఫెక్ట్‌‌‌‌ ఉందన్నారు.

సూపర్ మార్కెట్లలోనూ అంతంతే..

సూపర్‌‌‌‌ మార్కెట్లలో సాయంత్రం వేళ జనం పుంజుకున్నారు. నెలలో తొలి వారం కావడంతో ఇంటికి కావాల్సిన సరుకులు కొనేందుకు ఎక్కువగా వచ్చారు. అయినా మిగతా రోజులతో పోల్చితే గిరాకీ బాగా పడిపోయిందని స్టోర్ల మేనేజర్లు చెప్తున్నారు. రెండు రోజులుగా తమ గోడౌన్లకు రిటర్న్‌‌‌‌ చేసే స్టాక్‌‌‌‌ కూడా పెరిగిపోతోందని అంటున్నారు. బుధ, శనివారాల్లో లక్షల్లో బిజినెస్‌‌‌‌ చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మాత్రం జనం సాధారణంగానే కనిపించారు. పొద్దున, సాయంత్రం బస్సులు కిటకిటలాడాయి.