లవ్ జిహాద్‌‌‌‌‌‌‌‌కు పాల్పడ్డడు.. మూల్యం చెల్లించుకోవాల్సిందే: ఆమిర్ ఖాన్‎కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

లవ్ జిహాద్‌‌‌‌‌‌‌‌కు పాల్పడ్డడు.. మూల్యం చెల్లించుకోవాల్సిందే: ఆమిర్ ఖాన్‎కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

ముంబై: బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌‌‌‌‌‌‌‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపులు రావడం ముంబైలో కలకలం రేగింది. ఆమిర్ ఖాన్ మూడో వివాహంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. ఆయన లవ్ జిహాద్‎ను ప్రోత్సహిస్తున్నారని ముఠా ఆరోపించింది. అర్జు బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ అనే వ్యక్తులు తాము లారెన్స్ బిష్ణోయ్ అనుచరులమని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్, వాయిస్ క్లిప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. గౌరీ స్ప్రాట్‌‌‌‌‌‌‌‌ను వివాహం చేసుకోవడం ద్వారా ఆమిర్ ఖాన్ లవ్ జిహాద్‌‌‌‌‌‌‌‌కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.

ఇటువంటి చర్యలను ప్రోత్సహించే వారికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా, వాయిస్ నోట్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌లోని శ్రీగంగానగర్ జిల్లాలో 13 ఏండ్ల బాలిక కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటనను కూడా ముఠా ప్రస్తావించింది. ఈ కేసులోని నిందితులను ఏ రాజకీయ నాయకుడైనా కాపాడాలని చూస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. అయితే, ఈ బెదిరింపులపై ఆమిర్ ఖాన్ గానీ, ఆయన టీమ్ గానీ ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.