ఒక బిట్‌‌‌‌కాయిన్ ధర రూ.కోటి పైనే

ఒక బిట్‌‌‌‌కాయిన్ ధర రూ.కోటి పైనే

న్యూఢిల్లీ: బిట్‌‌‌‌కాయిన్ దూకుడు ఆగడం లేదు.  1,18,848 డాలర్లను (రూ. కోటి 2 లక్షలను) టచ్ చేసి సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.  ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి  డిమాండ్ పెరగడంతో పాటు, యూఎస్‌‌‌‌ ప్రభుత్వం తీసుకుంటున్న  విధానాల వల్ల బిట్‌‌‌‌కాయిన్ ర్యాలీ కొనసాగుతోంది.  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ క్రిప్టో కరెన్సీ ధర 24శాతం పెరిగింది. ఇథీరియం,  సోలానా, డాగ్‌‌‌‌కాయిన్, కార్డానో , ఎక్స్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌పీ, లైట్‌‌‌‌కాయిన్ వంటి క్రిప్టోలు కూడా భారీగా  లాభపడుతున్నాయి. ట్రంప్ క్రిప్టోల కోసం స్ట్రాటజిక్ రిజర్వ్ ఏర్పాటు చేస్తూ  ఈ ఏడాది మార్చిలో   ఆదేశాలు జారీ చేశారు. 

  ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ క్రిప్టో ఈటీఎఫ్‌‌‌‌ ప్రారంభించాలని చూస్తోంది. దీంతో బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. బిట్‌‌‌‌కాయిన్ ఈటీఎఫ్‌‌‌‌లలోకి పెట్టుబడులు వస్తుండడంతో ఈ క్రిప్టో కరెన్సీ ధర గత రెండు నెలలుగా  లక్ష డాలర్ల  పైన స్థిరంగా కదులుతోంది.