జడ్జిగారు ఇంత మంచి భ‌ర్త‌తో వేగ‌లేక‌పోతున్నా..విడాకులిప్పించండి

జడ్జిగారు ఇంత మంచి భ‌ర్త‌తో వేగ‌లేక‌పోతున్నా..విడాకులిప్పించండి

జ‌న‌ర‌ల్ గా భార్యలు విడాకులు కావాల‌ని కోర్ట్ ను ఎందుకు ఆశ్ర‌యిస్తారు. అత్తింటి అర‌ళ్లు భ‌రించ‌లేక‌నో లేదంటే భ‌ర్త వేధిస్తున్నాడ‌నో ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల భ‌ర్త‌నుంచి విడాకులు కావాల‌ని కోరుకుంటారు భార్యలు. కానీ ఈ భార్య మాత్రం అందుకు విరుద్దంగా త‌న‌ని అతిగా ప్రేమించే భ‌ర్త నుంచి విడాకులు ఇప్పించాల‌ని కోర్ట్ ను ఆశ్ర‌యించింది.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ సంభ‌ల్ జిల్లా కు చెందిన ముస్లీం మ‌హిళ కు 18 నెల‌ల‌ క్రితం వివాహం అయ్యింది. ఆమె భ‌ర్త స‌ద‌రు మ‌హిళ‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకున్నాడు. ఎంత‌లా అంటే ప్ర‌పంచంలో ఇంత మంచి భ‌ర్త ఉండ‌డు అనేలా. అయితే భ‌ర్త ప్రేమ‌ను చూసి త‌ట్టుకోలేని మ‌హిళ కోర్ట్ ను ఆశ్ర‌యించింది. విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌వాది సైతం మ‌హిళ వింత కోరిక‌పై ముక్క‌న వేలేసేకున్నాడు.

నాభ‌ర్త న‌న్నుబాగా చూసుకుంటున్నాడు. త‌ప్పు చేస్తే మంద‌లించ‌డు. వంటింట్లో సాయం చేస్తాడు. అడిగింది కాద‌న‌డు ఇలాంటి ప‌ప్పు సుద్ద నాకొద్దు. నేను త‌ప్పు చేస్తే మంద‌లించాలి. నాపై కోప్ప‌డాలి. అంతేకానీ నేను ఏం చేసినా అన్నింటికి సైలెంట్ గా ఉంటే ఎలాసార్. అది నేను త‌ట్టుకోలేక‌పోతున్నాను అంటూ కోర్ట్ కు విన్న‌వించుకుంది.

దీంతో మ‌హిళ రిక్వెస్ట్ ను కోర్ట్ కొట్టిపారేసింది. మ‌హిళ‌లు మంచి భ‌ర్త కావాల‌ని కోరుకుంటారు. నీకు అంత మంచి భ‌ర్త దొరికితే విడాకులు కావాల‌ని కోర్ట్ కు రావ‌డం ప‌ద్ద‌తి కాద‌ని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కోర్ట్ తీర్పించింది. ఆ తీర్పుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన మ‌హిళ పెద్ద‌ల పంచాయితీకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించింది. అక్క‌డా అమెకు అదే వ్య‌తిరేక‌త ఎదురైంది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన న్యూస్ సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతుంది.