ఎయిర్ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దేశమంతా గర్విస్తోంది : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 

ఎయిర్ స్ట్రైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దేశమంతా గర్విస్తోంది : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: భారతీయులకు హాని చేయాలని చూసే దుష్ట శక్తుల అంతు మోదీ సర్కార్ చూస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాధానంగా ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్మీ ఆప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ సిందూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి దేశమంతా గర్విస్తోందని, భార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త సైన్యానికి సెల్యూట్ అంటూ బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న ఈ సాహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోపేత నిర్ణయం ప్రపంచానికే దిక్సూచిగా నిలువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుందన్నారు. ఇలాంటి టైంలో మోదీకి దేశ ప్రజలంతా అండగా నిల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాలన్నారు.