బీజేపీ మహిళా కార్యకర్త అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

బీజేపీ మహిళా కార్యకర్త అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ట్విట్టర్‌ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ కార్యకర్త శకుంతల నటరాజ్‌ను హైగ్రౌండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరులో చోటుచేసుకుంది. 

ఎందుకు అరెస్ట్ చేశారంటే..?

కొద్దిరోజుల క్రితం ఉడిపిలోని ఓ కాలేజీలో విద్యార్థిని రెస్ట్‌రూమ్‌ వీడియో బయటకొచ్చింది. ఒక వర్గానికి ముగ్గురు విద్యార్థినులు వేరొక వర్గానికి చెందిన విద్యార్థిని రెస్ట్‌రూములో ఉండగా రహస్యంగా చిత్రీకరించి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ముగ్గురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.

ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాలు స్పందిస్తూ గతంలో ఇలాంటివి జరగలేదా? ఆరోజు ఏం చేశారంటూ ప్రభుత్వాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన బీజేపీ కార్యకర్త శకుంతల నటరాజ్‌.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులను ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమెపై కాంగ్రెస్ కార్యకర్త హనుమంతరాయ ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.