
కూసుమంచి, వెలుగు : జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్.. బీజేపీకి వత్తాసు పలుకుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఎన్డీఏ ప్రతిపాదించిన ఉప రాష్ట్రపతి క్యాండిడేట్‌కు ఓటు వేసేందుకే బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలని ఎద్దేవా చేశారు. భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఒక్కో జిల్లాకు రూ.కోటి కేటాయించినట్లు చెప్పారు. తెలంగాణకు యూరియా సరఫరా విషయంలో కేంద్రం తప్పుడు లెక్కలు చెప్తోందని, రాష్ట్రంలో యూరియా తయారీ కంపెనీలు లేనందున కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా సాధించేందుకు కేంద్రంపై పోరాటానికి సైతం సిద్ధమన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.