
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు వేగిరం చేసిన బీజేపీ.. మున్సిపాలిటీలకు క్లస్టర్ ఇన్చార్జులను నియమించింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో క్లస్టర్‌గా గుర్తించి, దాని పరిధిలోని మున్సిపాలిటీలన్నింటినీ కొందరు ఇన్చార్జులకు అప్పగించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి శనివారం ఈ జాబితాను మీడియాకు విడుదల చేశారు. మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారం, గెలుపు బాధ్యతలను ఆ క్లస్టర్ ఇన్చార్జులే పర్యవేక్షించనున్నారు.
- పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 11 మున్సిపాలిటీలు ఉండగా ఏడుగురు క్లస్టర్ ఇన్చార్జులను పార్టీ నియమించింది. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో పాటు మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, సోమారపు సత్యనారాయణ, బోడ జనార్దన్, ఎస్.కుమార్, ప్రదీప్ కుమార్, బల్మూరి వనిత ఈ జాబితాలో ఉన్నారు.
- నల్గొండ లోక్‌సభ పరిధిలోని 9 మున్సిపాలిటీల్లో ఎంపీ గరికపాటి మోహన్ రావు, మరో ఐదుగురిని ఇన్చార్జులుగా నియమించారు.
- భువనగిరి పరిధిలోని 14 మున్సిపాలిటీలకు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మరో ఐదుగురు ఇన్చార్జులుగా ఉంటారు.
- ఖమ్మం పరిధిలో 3 మున్సిపాలిటీలు ఉండగా మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మరో నలుగురికి అప్పగించారు.
- వరంగల్ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలకు మాజీ మంత్రి విజయరామారావు, ఇంకో ఐదుగురు నేతలు ఉంటారు.
- చేవెళ్లలోని 13 మున్సిపాలిటీలకు గాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, మరో ముగ్గురు ఉంటారు.
- సికింద్రాబాద్‌లోని 13 మున్సిపాలిటీలను దత్తాత్రేయ, మరో ఐదుగురు పర్యవేక్షిస్తారు.
- మెదక్ పరిధిలోని 12 మున్సిపాలిటీలకు మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, ఇంకో మరో ముగ్గురిని నియమించారు.
- జహీరాబాద్లోని 6 మున్సిపాలిటీలకు ఇంద్రసేనారెడ్డి, మరో నలుగురిని నియమించారు.
- కరీంనగర్ పరిధిలోని 8 మున్సిపాలిటీలకు ఎంపీ బండి సంజయ్, ఇంకో ముగ్గురు..
- నిజామాబాద్ పరిధిలో 7 మున్సిపాలిటీలకు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఇంకో నలుగురు..
- ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా ఎంపీ సోయం బాపురావు, మరో ఇద్దరు..
- మహబూబాబాద్ లో 6 మున్సిపాలిటీలకు పేరాల శేఖర్ రావు, ఇంకో ముగ్గురు..
- మహబూబ్ నగర్ పరిధిలోని 11 మున్సిపాలిటీలకు డీకే అరుణ, మరో ఐదుగురు..
- నాగర్ కర్నూల్ ఎంపీ పరిధిలో 10 మున్సిపాలిటీలు ఉండగా ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మరో ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.