ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

ఐదు  రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ

2024 ఎన్నికల  వేళ బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత అలర్ట్ అయిన బీజేపీ ఐదు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది.  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న  బండి సంజయ్ ను తొలగించి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని  నియమించింది. మరో వైపు  ఎన్నికల నిర్వహణ  కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ నియమితులయ్యారు.  అలాగే   బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సోమువీర్రాజును తొలగించి.. అనూహ్యంగా పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ హైకమాండ్. ఏపీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బీజేపీ  నేషనల్  ఎగ్జిక్యూటివ్‌ మెంబర్ గా ఎంపిక చేసింది.

ఐదు రాష్ట్రాల కొత్త అధ్యక్షులు వీళ్లే...

  • బీజేపీ రాజస్థాన్  అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్
  •  బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి
  • తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి.
  • పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ జక్కర్
  • జార్ఖండ్  అధ్యక్షుడిగా బాబులాల్ మరాండి